నయనతార – విఘ్నేష్ శివన్ లు తల్లిదండ్రులం అయ్యామని సంతోషంగా ప్రకటించి ఒకరోజు కూడా కాలేదు అప్పుడే చిక్కుల్లో పడింది నయనతార. సరోగసీ ద్వారా ఈ ఇద్దరూ తల్లిదండ్రులు అయ్యారు. దాంతో తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. నయనతారకు నోటీసులు ఇచ్చింది తమిళనాడు సర్కారు.
సరోగసీ విధానం పట్ల తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. నయనతార – విఘ్నేష్ శివన్ లు ఆ నియమాలను అనుసరించే సరోగసీ ద్వారా పిల్లలకు జన్మనిచ్చారా ? లేదా ? అన్నది తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది స్టాలిన్ సర్కారు. ఆమేరకు రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ ఈ విచారణ చేపట్టనుంది.
ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగానే సరోగసీ పద్దతిలో పిల్లలు కంటే ఇబ్బంది లేదు కానీ ఆంక్షలు ఉల్లంఘిస్తే మాత్రం ప్రభుత్వం చర్యలకు దిగుతుందని అనుకుంటున్నారు. ఇక మరో వాదన ఏంటంటే ……. విచారణ సాగడం ఖాయం కానీ ఆంక్షలను ఉల్లంఘించినట్లైతే చర్యలు తీసుకునే దమ్ము ప్రభుత్వానికి ఉందా ? చూసి చూడనట్లుగా వ్యవహరిస్తారు తప్ప అనే వాదన కూడా వినబడుతోంది.