
సౌతిండియా టాప్ హీరోయిన్ ఎవరని అడిగితే.. ప్రతి ఒక్కరూ నయన తార పేరు చెబుతారు. మొదట రజనీకాంత్ ‘చంద్రముఖి’ సినీ పరిశ్రమకి పరిచయమై.. అనంతరం వెంకటేశ్ ‘లక్ష్మి’తో టాలీవుడ్‌లోనూ అడుగుపెట్టి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అయితే.. ఈ బ్యూటీ గతేడాది జూన్‌లో ప్రముఖ తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ ని గ్రాండ్‌గా వివాహం చేసుకుంది. పెళ్లైన కొన్ని నెలలకే సరోగసీ ద్వారా ఈ జంటకి కవల పిల్లలు పుట్టారు. అప్పటి నుంచి ఏదో ఓ రకంగా ఆ పిల్లలకి సంబంధించిన వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తుంటాయి. తాజాగా మరోసారి నయన్ పిల్లలకి సంబంధించిన ఓ క్రేజీ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
నయన్, విఘ్నేష్ జంటకి పిల్లలు పుట్టినప్పటి నుంచి వారి పేర్లపై చర్చ జరుగుతోంది. ఆ సమయంలో తన పిల్లల పేర్లు ఇవేనంటూ.. విఘ్నేష్ శివన్ సోషల్ మీడియాలో పోస్టుని షేర్ చేశాడు. అందులో వారి పేర్లు కేవలం ఉయిర్, ఉలగ్ అనే పేరు పెట్టామని తెలిపాడు. అయితే.. పూర్తి పేర్లు ఏంటనేది మాత్రం చెప్పలేదు. తాజాగా వారి పూర్తి పేర్లను నయనతార స్వయంగా రివీల్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
చెన్నైలో తాజాగా జరిగిన ఓ అవార్డుల ఫంక్షన్‌కి పాల్గొన్న నయనతార తన పిల్లల పూర్తి పేర్లను రివీల్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. నా మొదటి కుమారుడు పేరు ఉయిర్ రుద్రోనిల్ ఎన్ శివన్ , నా రెండో కుమారుడి పేరే ఉలగ్ ధైవేగ్ ఎన్ శివన్ అని చెప్పుకొచ్చింది. తన పేరుతో పాటు తన భర్త పేరును కలిసే విధంగా
పేరు పెట్టారు. దీంతో ఇద్దరి పేర్లు బావున్నాయని.. త్వరలోనే వారి ఫేస్ కూడా చూపించాలని నెటిజన్లను కోరుతున్నారు. అంతేకాక పిల్లల పేర్లపై రకరకాలుగా స్పందిస్తున్నారు. పిల్లల పేర్ల విషయంలో తమదైన మార్క్ చూపించుకున్నారని కామెంట్లు చేస్తున్నారు. అయితే.. ’రుద్రోనిల్, ధైవేగ్ అంటే అర్థం ఏంటి’.. ‘ఇవేం పేర్లు’ అంటూ కొందరూ విమర్శలు సైతం చేస్తున్నారు.
ఇక నయనతార సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్లో జవాన్ సినిమాలో షారుక్ ఖాన్ సరసన నటిస్తోంది. అంతేకాకుండా ఇటీవల తమిళ తమిళంలో ఒక చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.






