
ఆర్ ఆర్ ఆర్ సినిమాకు ఆస్కార్ వచ్చిన విషయం తెలిసిందే. అంతటి గొప్ప పురస్కారం మన భారతీయ సినిమాకు అందునా సౌత్ సినిమాకు వస్తే కనీసం ఆ టీమ్ కు శుభాకాంక్షలు చెప్పవా ? అంటూ తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ పై మండిపడుతున్నారు నెటిజన్లు. ట్విట్టర్ లో ఇష్టానుసారం విమర్శలు చేయడం అలాగే రకరకాల ఎమోజీలతో ఆట ఆడుకోవడం సర్వసాధారణమైపోయింది. దాంతో హీరో విజయ్ పై అదేపని చేస్తున్నారు నెటిజన్లు.
అయితే ఇదే సమయంలో హీరో విజయ్ ను సమర్ధించే అభిమానులు కూడా ఉన్నారు. దాంతో ట్రోల్స్ లో పోటాపోటీగా సాగుతోంది. విమర్శలు ప్రతి విమర్శలతో సాగుతోంది ట్విట్టర్. ఇళయ దళపతి విజయ్ కు స్ట్రాంగ్ బేస్డ్ ఫ్యాన్స్ ఉన్నారనే విషయం తెలిసిందే. దాంతో వస్తున్న విమర్శలకు గట్టిగానే సమాధానం చెబుతున్నారు. అయితే విజయ్ కూడా ఆర్ ఆర్ ఆర్ టీమ్ ను అభినందిస్తే బాగుండేది కదా ! అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం హీరో విజయ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ” లియో ” అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. త్రిష ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఇక దక్షిణ భారతదేశ దిగ్గజాలు ఈ చిత్రంలో నటిస్తున్నారు.