ప్రముఖ దర్శకులు మణిరత్నం 40 ఏళ్ల కల ……. పొన్నియన్ సెల్వన్. ఎన్నో సంవత్సరాలుగా పొన్నియన్ సెల్వన్ అనే చిత్రాన్ని చేయాలని చాలా గట్టి ప్రయత్నాలే చేసారు. కానీ ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా వెలుగొందినప్పటికీ ఆ సినిమాకు మోక్షం కలగలేదు. అయితే విచిత్రంగా మణిరత్నంకు స్టార్ డం పోయిన తర్వాత ఈ చిత్ర నిర్మాణానికి పలువురు సహకరించారు. దాంతో పొన్నియన్ సెల్వన్ చిత్రం రూపొందింది.
ఇక సెప్టెంబర్ 30 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విక్రమ్ , ఐశ్వర్యారాయ్ , కార్తీ , జయం రవి , త్రిష , ప్రకాష్ రాజ్ , శరత్ కుమార్ ,విక్రమ్ ప్రభు , శోభిత ధూళిపాళ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 30 న ఈ సినిమా విడుదల అవుతుండటంతో నిన్న సెప్టెంబర్ 23 న పొన్నియన్ సెల్వన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీ ఎత్తున నిర్వహించారు.
ఈ చిత్రంలో నటించడం తమ అదృష్టమంటూ నటించిన పలువురు నటీనటులు పేర్కొనడం విశేషం. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. దిల్ రాజు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. మణిరత్నం సుహాసిని భర్త అనే విషయం తెలిసిందే. దాంతో ఒకప్పుడు తెలుగునాట నన్ను స్టార్ హీరోయిన్ గా ఆదరించారు …… ఇప్పుడు పొన్నియన్ సెల్వన్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించాల్సిన అవసరం ఉందన్నారు. ఎందుకంటే ఈ సినిమాను 10 శాతం మాత్రమే తమిళనాడులో షూట్ చేసాం …… మిగతా 90 శాతం షూటింగ్ రాజమండ్రి , హైదరాబాద్ లలో చేశామంటూ తెలుగు ప్రేక్షకులను సెంటిమెంట్ తో కొట్టింది సుహాసిని.