మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ” పొన్నియన్ సెల్వన్ -1”. సెప్టెంబర్ 30 న విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. అయితే వసూళ్లు చూస్తుంటే మాత్రం కళ్ళు జిగేల్ మనడం ఖాయం. ఎందుకంటే 3 రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లుగా ప్రకటించారు మేకర్స్. దాంతో షాక్ అవ్వడం ట్రేడ్ విశ్లేషకుల వంతు అయ్యింది.
విక్రమ్ , కార్తీ , ఐశ్వర్యారాయ్ , జయం రవి , ప్రకాష్ రాజ్ , త్రిష తదితరులు నటించిన ఈ చిత్రం పై మణిరత్నం చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఒక పార్ట్ గా చిత్రీకరిస్తే దీనికి న్యాయం చేయలేమని భావించి రెండు పార్ట్ లుగా చేసారు. మొదటి భాగం సెప్టెంబర్ 30 న విడుదల కాగా రెండో భాగాన్ని వచ్చే ఏడాది విడుదల చేయాలని అనుకుంటున్నారు.
పొన్నియన్ సెల్వన్ చిత్రం చేయాలనేది మణిరత్నం నలభై ఏళ్ల కల. ఇప్పటి వరకు చాలా ప్రయత్నాలు చేసాడు కానీ అది ఇన్నాళ్లకు కుదిరింది. అయితే ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ 3 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించడంతో అందరూ షాక్ అవుతున్నారు. వరుస సెలవులు కూడా ఈ వసూళ్లకు ఒక కారణమని , అలాగే భారీ తారాగణం మరో కారణం అని అంటున్నారు.