
సుప్రసిద్ధ దర్శకులు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ 500 కోట్ల దిశగా దూసుకుపోతోంది. చియాన్ విక్రమ్ , కార్తీ , ఐశ్వర్యారాయ్, త్రిష, జయం రవి తదితరులు నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా విడుదల అయ్యాక ఆ అంచనాలను అందుకునేలా సినిమా లేదనే మాట వినిపించింది. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భారీ వసూళ్లను సాధిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 469 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది ఈ చిత్రం.
ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను సాధిస్తున్నప్పటికి ఇందులో మేజర్ షేర్ మాత్రం తమిళనాడు నుండే. తమిళ సినీ రంగానికి చెందిన ప్రముఖులు చేసిన సినిమా కావడంతో తమిళనాట ఎక్కువ వసూళ్లు సాధిస్తోంది. పొన్ని యన్ సెల్వన్ మంచి వసూళ్లను సాధించడంతో రెండో పార్ట్ షూటింగ్ కు సిద్ధమయ్యారు మణిరత్నం.