సుప్రసిద్ధ దర్శకులు మణిరత్నం దర్శకత్వంలో తెరెకెక్కిన చిత్రం ” పొన్నియన్ సెల్వన్ -1”. రెండు భాగాలుగా రూపొందిన ఈ చిత్రంలోని మొదటి భాగాన్ని ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసారు. విక్రమ్ , కార్తీ , ఐశ్వర్యారాయ్ , త్రిష , జయం రవి , ప్రకాష్ రాజ్ , శరత్ కుమార్ , విక్రమ్ ప్రభు , శోభిత ధూళిపాళ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాంతో ఈ సినిమాని చూసిన వాళ్ళు ట్విట్టర్ లో తమ రివ్యూ ఇస్తున్నారు.
ఇంతకీ ట్విట్టర్ రివ్యూ ప్రకారం పొన్నియన్ సెల్వన్ -1 ఎలా ఉందో తెలుసా …….. బాగానే ఉందని అంటున్నారు. సాలిడ్ బ్లాక్ బస్టర్ కాదు కానీ క్లాస్ మూవీ అని అంటున్నారు. అయితే మరికొంతమంది మాత్రం గొప్పగా ఏమి లేదు అంటూ పెదవి విరుస్తున్నారు. ఫస్టాఫ్ మాత్రం బాగుందట , సెకండాఫ్ ఆశించిన స్థాయిలో లేదని ట్వీట్ లు పెడుతున్నారు. అయితే ఇది కొంతమంది అభిప్రాయం మాత్రమే. అసలైన తీర్పు మాత్రం పూర్తిస్థాయి ప్రేక్షకులు ఇవ్వనున్నారు. అంటే మెజారిటీ ప్రేక్షకులకు నచ్చితే సూపర్ హిట్ లేదంటే …… లేదు అన్నమాట.
మణిరత్నం ఈ చిత్రాన్ని చేయడానికి 40 ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే భారీ బడ్జెట్ చిత్రం కావడం అలాగే సరైన నటీనటులను ఎంపిక చేసే లోపల డేట్స్ క్లాష్ రావడం మూలంగా వాయిదాల మీద వాయిదాలు పడి సెట్స్ పైకి వెళ్ళలేదు. కట్ చేస్తే ఇన్నాళ్ల తర్వాత పొన్నియన్ సెల్వన్ ని పూర్తి చేసాడు మణిరత్నం. ఇక దీనిపై ప్రేక్షకుల తీర్పు కొద్ది గంటల్లోనే తేలనుంది.