
సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు డిసెంబర్ 12. ఆ రోజు అభిమానులకు పెద్ద పండగ రోజు. డిసెంబర్ 12 న దేశ వ్యాప్తంగా రజనీకాంత్ అభిమానులు పలు సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతుంటారు. అయితే ఇటీవల కాలంలో స్టార్ హీరోల పుట్టినరోజు సందర్బంగా ఆ హీరోలు నటించిన పలు చిత్రాలను విడుదల చేయడం సర్వసాధారణం అయిపోయింది.
తాజాగా అదే కోవలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ” శివాజీ ” చిత్రాన్ని డిసెంబర్ 12 న దేశ వ్యాప్తంగా తమిళం , హిందీ భాషల్లో విడుదల చేయడానికి రెండు మల్టీప్లెక్స్ సంస్థలు నిర్ణయించాయి. దేశ వ్యాప్తంగా ఉన్న పీవీఆర్ , సినీపోలీస్ మల్టీప్లెక్స్ లలో శివాజీ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన శ్రియా శరన్ నటించిన విషయం తెలిసిందే. ఇక కీలక పాత్రల్లో సుమన్ , రఘువరన్ , వివేక్ , మణివణ్ణన్ తదితరులు నటించారు. ఏ ఆర్ రెహమాన్ అందించిన పాటలు ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచాయి. శివాజీ చిత్రంతో పాటుగా బాబా చిత్రాన్ని కూడా ప్రదర్శించేలా ప్రయత్నాలు చేస్తున్నారట.