సూపర్ స్టార్ రజనీకాంత్ నటుడిగా 47 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు. 1975 లో రజనీకాంత్ నటించిన మొట్టమొదటి చిత్రం విడుదల అయ్యింది. దర్శక దిగ్గజం కె. బాలచందర్ రజనీకాంత్ ని ” అపూర్వ రాగంగాళ్ ” చిత్రంతో నటుడిగా పరిచయం చేసాడు. ఆ సినిమా విడుదలై 47 ఏళ్ళు పూర్తి కావడంతో తన భర్త రజనీకాంత్ కు పుష్పగుచ్చం ఇచ్చి మరీ సర్ ప్రైజ్ చేసింది.
1975 లో నటుడిగా చిత్రరంగ ప్రవేశం చేసాడు రజనీకాంత్. కెరీర్ ప్రారంభంలో కొన్నాళ్ళు ఇబ్బంది పడినప్పటికీ , తీవ్ర అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ ఆ అవమానాలను సోపానాలుగా మార్చుకొని తమిళనాట నెంబర్ వన్ హీరోగా ఎదిగాడు. అంతేకాదు రజనీకాంత్ అంటే కేవలం తమిళనాడుకు మాత్రమే పరిమితం కాలేదు……. దేశ వ్యాప్తంగా , ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేకత నిరూపించుకున్నాడు.
ప్రపంచ వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న ఏకైక హీరో రజనీకాంత్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అని అంటున్నారు కానీ రజనీకాంత్ ఎప్పుడో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆయన నటించిన చిత్రాలన్నీ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున అన్ని దేశాల్లో విడుదల అవుతుంటాయి. గత పదేళ్లుగా రజనీకాంత్ కు సాలిడ్ హిట్ లేదు . అయినప్పటికీ ఇప్పటికి కూడా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది రజనీ నటించిన చిత్రాలకు. తాజాగా జైలర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు రజనీకాంత్. ఆ చిత్రం కూడా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది.
Breaking News