సూపర్ స్టార్ రజనీకాంత్ కు గవర్నర్ పదవి ఇవ్వాలనే ఆలోచన చేస్తోందట భారతీయ జనతా పార్టీ. సినిమాల్లో తిరుగులేని సూపర్ స్టార్ అయిన రజనీకాంత్ గత 30 ఏళ్లుగా రాజకీయాల్లోకి వస్తున్నాను అంటూ అభిమానులను ఊదరగొట్టాడు. కట్ చేస్తే గత తమిళనాడు ఎన్నికల సందర్బంగా రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా ప్రకటించాడు.
దాంతో రజనీకాంత్ అభిమానులు చాలా సంతోషించారు. అయితే అనూహ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తనకు ఆరోగ్యం సహకరించడం లేదని చెబుతూ రాజకీయాలకు స్వస్తి చెబుతున్నట్లుగా ప్రకటించాడు. దాంతో అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అంతేకాదు తమిళనాడు వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు చేసారు. కానీ రజనీకాంత్ మాత్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు.
కట్ చేస్తే …….. తాజాగా వినబడుతున్న కథనం ప్రకారం ……. రజనీకాంత్ కు గవర్నర్ పదవి ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారట బీజేపీ పెద్దలు. తమిళనాట ఎలాగైనా సరే రాజకీయంగా ఎదగాలని బీజేపీ భావిస్తోంది. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా బీజేపీ పెద్దల ప్రయత్నాలు ఫలించడం లేదు. దాంతో రజనీకాంత్ కు పదవి ఇవ్వడం ద్వారా ప్రత్యక్ష రాజకీయాలు కాదు కాబట్టి రజనీ గౌరవాన్ని కాపాడినట్లు అవుతుంది అలాగే తమిళనాట రజనీ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి అలా బీజేపీ కి కలిసి వస్తుందనే ఆలోచనలో ఉన్నారట. అయితే ఇంకా రజనీకాంత్ మాత్రం ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
Breaking News