సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తానని ముందుకు వస్తే ఏ దర్శకుడు అయినా సరే ఎగిరి గంతేస్తారు కానీ మణిరత్నం మాత్రం రజనీకాంత్ ని వద్దని చెప్పాడట ! ఈ విషయాన్ని ఎవరో చెప్పడం కాదు ……. స్వయంగా రజనీకాంత్ వెల్లడించాడు. తాజాగా మణిరత్నం దర్శకత్వం వహించిన చిత్రం ” పొన్నియన్ సెల్వన్ ”. భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిన్న చెన్నై లో భారీ ఎత్తున జరిగింది.
కాగా ఆ వేడుకకు ముఖ్య అతిథులు సూపర్ స్టార్ రజనీకాంత్ , లోకనాయకుడు కమల్ హాసన్ లు హాజరయ్యారు. ఇక ఇదే వేదిక మీద తాను ఇందులో నటిస్తానని మణిరత్నం ను అడిగితే ఒప్పుకోలేదని , నువ్వు చిన్న పాత్ర పోషిస్తే నీ అభిమానులు నన్ను తిడతారు , కొడతారు అంటూ రిజెక్ట్ చేసాడని , కానీ మరో దర్శకుడు అయితే మాత్రం ఎగిరి గంతేసేవాళ్ళని ……. మణిరత్నం కు మిగతా దర్శకులకు ఇదే తేడా అని రజనీకాంత్ అన్నాడు.
విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్యారాయ్ , త్రిష , ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన పొన్నియన్ సెల్వన్ చిత్రాన్ని నాలుగు దశాబ్దాలుగా చిత్రీకరించాలని చాలామంది ప్రయత్నాలు చేసారు. కానీ కుదరలేదు. ఇన్నాళ్లకు మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను చేసాడు. ఇక ఈ చిత్రంలో కార్తీ పోషించిన పాత్రను పోషించాలని రజనీకాంత్ అనుకున్నాడట అప్పట్లో. ఇప్పుడు కార్తీ చేయడంతో సంతోషిస్తునాడు.