
1995 లో విడుదలైన సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రం ” ముత్తు ”. తెలుగు , తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా జపాన్ లో కూడా భారీ విజయాన్ని సాధించింది. 1995 లోనే జపాన్ లో ఈ సినిమా 22 కోట్ల వసూళ్లను సాధించి చరిత్ర సృష్టించింది. ఒక డబ్బింగ్ సినిమా అప్పట్లోనే 22 కోట్లు సాధించడం చరిత్రగా నిలిచింది. అంటే ఈ సినిమాను ఇప్పటి వరకు ఏ సినిమా కూడా టచ్ చేయలేకపోయింది.
గత 27సంవత్సరాలుగా ముత్తు రికార్డుల దరిదాపుల్లోకి ఏ చిత్రాలు కూడా రాలేకపోయాయి. అయితే తాజాగా ఆ రికార్డ్ ను మాత్రం ఆర్ ఆర్ ఆర్ సినిమా బద్దలు కొట్టింది. జపాన్ లో ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమా 23 కోట్ల వసూళ్లను సాధించింది. దాంతో ముత్తు రికార్డ్ బద్దలయ్యింది.
రజనీకాంత్ రికార్డ్ బద్దలు కావడానికి 27 సంవత్సరాలు పట్టింది. జపాన్ లో గత 27 సంవత్సరాలుగా సినిమా టికెట్ రేట్లు పెరగకపోవడం గమనార్హం. రజనీకాంత్ కు జపాన్ లో విపరీతమైన క్రేజ్ ముత్తు సినిమా తోనే ప్రారంభమైంది. ” థిలాన థిలాన ” అనే పాట జపాన్ దేశాన్ని ఒక ఊపు ఊపేసింది. ఇప్పటికి కూడా ఆ పాట యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తోంది. జపాన్ లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో నెంబర్ వన్ గా ఆర్ ఆర్ ఆర్ నిలవగా రజనీకాంత్ ముత్తు రెండో స్థానంలో నిలిచింది.