సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్ రెండో పెళ్ళికి రంగం సిద్దమైనట్లు తమిళ మీడియాలో కథనాలు జోరుగా వస్తున్నాయి. రజనీకాంత్ కు ఇద్దరు కూతుర్లు అనే విషయం తెలిసిందే. పెద్ద కూతురు ఐశ్వర్య కాగా రెండో కూతురు సౌందర్య. ఇక పెద్ద కూతురు ఐశ్వర్య ను హీరో ధనుష్ కు ఇచ్చి పెళ్లి చేసిన విషయం తెలిసిందే.
వాళ్ళు 17 సంవత్సరాల పాటు కాపురం చేసారు. ఆ ఇద్దరికీ ఇద్దరు అబ్బాయిలు కూడా. అయితే గతకొంత కాలంగా భార్యాభర్తల మధ్య తీవ్ర మనస్పర్థలు వస్తుండటంతో విడాకులు తీసుకున్నారు. అయితే ఇద్దరినీ కలిపి ఉంచాలని , విడాకులు తీసుకోకుండా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేసారు. అయితే కుదరలేదు దాంతో ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు.
కట్ చేస్తే ……. ఐశ్వర్య రెండో పెళ్ళికి సిద్దమైనట్లు తెలుస్తోంది. రజనీకాంత్ ఫ్రెండ్ కొడుకుని ఐశ్వర్య రెండో పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. అతడికి కూడా ఇది రెండో పెళ్లి అట. అతడికి కూడా ముందే పెళ్లి అయ్యింది …… విడాకులు కూడా అయ్యాయి. అతడ్ని పెళ్లి చేసుకోవడానికి ఐశ్వర్య ఒప్పుకోవడంతో త్వరలోనే ఈ పెళ్లి జరుగనున్నట్లు సమాచారం.