
సూపర్ స్టార్ రజనీకాంత్ కాంతార చిత్రాన్ని చూసాడు. ఆ సినిమా చూశాక ఇదొక మాస్టర్ పీస్ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కన్నడ రాష్ట్రానికి చెందిన సంస్కృతి ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించిన తీరుకు రిషబ్ శెట్టిపై ప్రశంసలు కురిపించారు. ఓ సాధారణ కథను అద్భుతంగా మలిచిన తీరుకు ప్రేక్షకులు మాత్రమే కాదు పలువురు స్టార్ హీరోలు కూడా ఫిదా అవుతున్నారు.
అక్టోబర్ 15 న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అలాగే ఈ సినిమాను చూసిన పలువురు సినీ ప్రముఖులు హీరో , దర్శకుడు కూడా అయిన రిషబ్ శెట్టి పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అందులో భాగంగానే సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా కాంతార చిత్రంపై ప్రశంసలు కురిపించారు.
కాంతార చిత్రంలో హీరోగా నటించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించాడు రిషబ్ శెట్టి. తాను ఎంతో కష్టపడి రూపొందించిన చిత్రానికి పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కుతుండటంతో చాలా సంతోషంగా ఉన్నాడు రిషబ్ శెట్టి. ఒకప్పుడు ఈ హీరో చిన్న హీరో మాత్రమే…… కానీ ఇప్పుడు కాంతార చిత్రంతో ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు.