చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న రాత్రి నందమూరి తారకరత్న కన్నుమూశారని తెలిసి చిత్ర పరిశ్రమ తీవ్ర షాక్ కు గురి కాగా ఈరోజు తెల్లవారుఝామున ప్రముఖ తమిళ కమెడియన్ ” మయిల్ సామి ” అనారోగ్యంతో కన్నుమూశాడు. దాంతో మరింత విషాదం నెలకొంది. 57 సంవత్సరాల మయిల్ సామి ఎక్కువగా తమిళ చిత్రాల్లో నటించాడు.
హాస్య నటుడిగా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విభిన్న పాత్రలను పోషించిన ఈ నటుడు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే ! మయిల్ సామి నటించిన పలు తమిళ చిత్రాలు తెలుగులో కూడా డబ్ అయ్యాయి దాంతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ నటుడు సుపరిచితుడే. ఈరోజు తెల్లవారు ఝామున అస్వస్థతకు గురి కాగా ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.
అయితే ఆసుపత్రికి చేరుకునేలోగానే మయిల్ సామి కన్నుమూసినట్లు డాక్టర్లు తెలిపారు దాంతో సామి కుటుంబం దుఃఖ సాగరంలో మునిగింది. మయిల్ సామి నటించిన పలు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి.