
తమిళనాట స్టార్ వార్ ముదిరింది. దాంతో ఫ్యాన్స్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఇంతకీ తమిళనాట ఈ స్టార్ హీరోలు ఎవరో తెలుసా …….. విజయ్ – అజిత్. తమిళనాట ఈ ఇద్దరు కూడా పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు. దాంతో తరచుగా ఈ ఇద్దరు హీరోల అభిమానులు సోషల్ మీడియాలో వార్ కొనసాగిస్తూనే ఉంటారు. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ గొడవలకు సై అంటే సై అంటుంటారు.
తాజాగా ఈ ఇద్దరి అభిమానుల మధ్య మరోసారి భీకర పోరు సాగుతోంది. ఎందుకంటే 2023 జనవరి 12 న విజయ్ నటించిన ” వారిసు ” అజిత్ నటించిన ” తునివు ” చిత్రాలు ఒకే రోజున విడుదల అవుతున్నాయి. ఇద్దరు కూడా స్టార్ హీరోలు కాబట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్నవాళ్లు కాబట్టి ఒకరోజు తేడాతో నైనా సినిమా విడుదల చేయాలని దిల్ రాజు గట్టి ప్రయత్నాలే చేసాడు కానీ కుదరలేదు. దాంతో తమిళనాట ఉన్న 800 థియేటర్ లలో సగం మాకు సగం అజిత్ కు కాకుండా మాకు మరో 50 థియేటర్ లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు దిల్ రాజు.
ఎందుకంటే విజయ్ నెంబర్ వన్ హీరో కాబట్టి అజిత్ కంటే విజయ్ సినిమాకు మరో 50 థియేటర్లు మాకు ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాడు అంతేకాదు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను కూడా కలుస్తానని అంటున్నాడు. అయితే విజయ్ నెంబర్ వన్ హీరో అజిత్ కాదు అని దిల్ రాజు స్టేట్ మెంట్ ఇవ్వడంతో అజిత్ ఫ్యాన్స్ దిల్ రాజు మీద అలాగే హీరో విజయ్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ గొడవ ఎలాంటి మలుపులకు దారి తీస్తుందో అనే టెన్షన్ నెలకొంది. మొత్తానికి రెండు పెద్ద సినిమాలు ఒకే రోజున విడుదల అవుతుండటంతో తీవ్రమైన పోటీ నెలకొంది అభిమానుల మధ్య.