ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి , తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుతో సూపర్ స్టార్ రజనీకాంత్ సమావేశమయ్యారు. దాంతో ఆ విషయం సంచలనంగా మారింది. హైద్రాబాద్ లోని చంద్రబాబు నివాసానికి వచ్చారు సూపర్ స్టార్ రజనీకాంత్. ఇద్దరి మధ్య దాదాపు గంటసేపు సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. అలాగే పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. రజనీకాంత్ తన ఇంటికి రావడంతో ఆయన్ని శాలువాతో సత్కరించారు చంద్రబాబు.
రజనీకాంత్ చంద్రబాబుతో సమావేశం కావడం పట్ల రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక సినిమాల విషయానికి వస్తే ….. రజనీకాంత్ తాజాగా నెల్సన్ దర్శకత్వంలో జైలర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఎక్కువ భాగం రామోజీ ఫిలిం సిటీలోనే షూటింగ్ జరుపుకుంటోంది. దాంతో రజనీకాంత్ తరచుగా హైద్రాబాద్ రావాల్సి వస్తోంది. జైలర్ షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన రజనీకాంత్ ఇలా చంద్రబాబును కలిశారు.