సూపర్ స్టార్ రజనీకాంత్ తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నాడు. కుటుంబ సమేతంగా వచ్చిన రజనీకాంత్ కు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి దర్శనం అయ్యాక తీర్థ ప్రసాదాలను అందించారు ఆలయ అధికారులు. వెంకటేశ్వరస్వామి దర్శనం కావడంతో పులకించిపోయాడు రజనీకాంత్.
తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. గతకొంత కాలంగా రజనీకాంత్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించడం లేదు. ఆ లోటును జైలర్ చిత్రం తీరుస్తుందనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. ఒక్కో సినిమాకు 100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటూ సంచలనం సృష్టిస్తున్నాడు రజనీ.
గతకొంత కాలంగా రజనీకాంత్ సినిమాలు సరిగ్గా ఆడటం లేదు అయినప్పటికీ క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు. అంతేకాదు రెమ్యునరేషన్ విషయంలో మరింతగా పెరుగుతూనే ఉంది. ఇక జైలర్ చిత్రం ఎలాంటి ఫలితాన్ని పొందుతుందో చూడాలి. 72 ఏళ్ల వయసులో కూడా బాక్సాఫీస్ ను దున్నే సత్తా ఉన్న హీరో వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ రజనీకాంత్.