
తమిళ స్టార్ హీరో సూర్య జాతీయ అవార్డు అందుకున్నారు. సూరరైపొట్రు అనే చిత్రంలో నటించడమే కాకుండా ఆ చిత్రాన్ని నిర్మించారు కూడా. దాంతో ఆ సినిమాకు జాతీయ అవార్డు లభించింది. హీరో , దర్శకురాలు , నిర్మాణ సంస్థ ఇలా కీలకమైన విభాగాల్లో అవార్డులు రావడంతో సూర్య , జ్యోతిక , దర్శకురాలు సుధా కొంగర చాలా చాలా సంతోషంగా ఉన్నారు.
సూరరైపొట్రు అనే తమిళ చిత్రం తెలుగులో ఆకాశమే హద్దురా అనే టైటిల్ తో విడుదల అయ్యింది. సినిమాకు మంచి పేరు వచ్చింది కానీ తెలుగులో పెద్దగా ఆడలేదు. తమిళ్ లో మాత్రం సూర్యకున్న క్రేజ్ తో బాగానే ఆడింది. అప్పుడే ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు సూర్య అండ్ కో. కట్ చేస్తే జాతీయ అవార్డుల పంట పండటంతో మరింతగా ఆనందపడుతున్నారు.
సెప్టెంబర్ 30 న దేశ రాజధాని ఢిల్లీలో అవార్డుల వేడుక జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు అవార్డు గ్రహీతలు. ఈ చిత్రాన్ని హీరో సూర్య నిర్మించారు. జ్యోతిక నిర్మాతగా వ్యవహరించింది .