సూర్య ని స్టార్ హీరోను చేసింది గజిని చిత్రం. 2008 లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా డబ్ అయి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సూర్య కెరీర్ లోనే నెంబర్ వన్ చిత్రంగా నిలిచింది. అంతేకాదు తమిళనాట ప్రభంజనం సృష్టించింది.
కట్ చేస్తే ఇన్నాళ్లకు ఆ సినిమాకు సీక్వెల్ చేసే పనిలో పడ్డాడట దర్శకులు మురుగదాస్. గతకొంత కాలంగా మురుగదాస్ పలు చిత్రాలను చేయాలనుకున్నాడు కానీ వర్కౌట్ కాలేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ తో చేసిన దర్బార్ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. దాంతో మురుగదాస్ కు సరైన సినిమాలు లేకుండాపోయాయి.
దాంతో సూర్యను కలిసి గజిని సీక్వెల్ గురించి చెప్పాడట. దాంతో సంతోషించిన సూర్య తప్పకుండా చేద్దామని , స్క్రిప్ట్ పక్కాగా చేయండి అని అన్నాడట. గజిని సీక్వెల్ కథ కనుక సెట్ అయితే ఈ కాంబినేషన్ లో మరో సినిమా రావడం ఖాయం. ప్రస్తుతం సూర్య అయితే చాలా బిజీగా ఉన్నాడు వరుస సినిమాలతో. ఈ సీక్వెల్ కథ సెట్ అయితే పట్టాలెక్కడం ఖాయం.ఇక ఈ కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు ఆకాశాన్ని అంటడం ఖాయం.