33.9 C
India
Friday, March 29, 2024
More

    సంచలనం సృష్టిస్తున్న సూర్య 42 టైటిల్ కంగువ

    Date:

    సంచలనం సృష్టిస్తున్న సూర్య 42 టైటిల్ కంగువ
    సంచలనం సృష్టిస్తున్న సూర్య 42 టైటిల్ కంగువ

    తమిళ స్టార్ హీరో సూర్య తాజాగా నటిస్తున్న 42 వ చిత్రానికి ” కంగువ ” అనే టైటిల్ ను ఖరారు చేసారు మేకర్స్. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నాడు. సూర్యకు మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతోంది ఈ చిత్రం. దిశా పటాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో కమెడియన్ యోగిబాబు కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.

    తాజాగా ఈ చిత్రానికి కంగువ అనే టైటిల్ ని ఖరారు చేసారు. మ్యాన్ విత్ పవర్ ఆఫ్ ఫైర్ అనే ఉప శీర్షికతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2024 ప్రారంభంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా మొత్తంగా 10 భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

    ఈ చిత్రాన్ని బాహుబలికి పోటీగా భావిస్తున్నారు. నిర్మాత జ్ఞానవేల్ రాజా గతంలోనే ఈ స్టేట్ మెంట్ ఇచ్చి సంచలనం సృష్టించాడు. బాహుబలి లాంటి సినిమాలను నిర్మించిన టాలీవుడ్ కు మా కంగువతో సమాధానం చెబుతామని ప్రకటించాడు. కంగువ టైటిల్ పట్ల అలాగే మోషన్ పోస్టర్ పట్ల అభిమానులు చాలా సంతోషించడం ఖాయం. ఎందుకంటే అభిమానులను అలరించేలా రీరికార్డింగ్ తో అద్భుతమైన విజువల్స్ వీడియో విడుదల చేసారు మేకర్స్. ఆల్రెడీ సూర్యకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఇక ఈ సినిమాతో సూర్య కూడా పాన్ ఇండియా స్టార్ అవ్వడం ఖాయమని భావిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Election King : 238సార్లు ఓడినా.. మళ్ళీ పోటీ కి సిద్ధం అయిన.. ఓ నాయకుడు..! 

    Election King : దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తమిళనాడుకు చెందిన...

    Congress : ఈనెల 30న కాంగ్రెస్ లోకి కేకే, విజయలక్ష్మి? 

    Congress : బీఆర్ఎస్ సీనియర్ నేత కే.కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరే...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pushpa 2 : ‘పుష్ప 2’ లో ఐటమ్ సాంగ్ లో చేసే నటి ఎవరో తెలుసా!

    Pushpa 2 : పుష్ప' సినిమాలో సమంత, అల్లు అర్జున్ ల...

    Suriya Jyothika : పిల్లలతో కలిసి ముంబైకి జ్యోతిక షిఫ్ట్.. సూర్య ఇంట్లో ఏం జరుగుతోంది..?

    Suriya Jyothika : సెలబ్రిటీలు అనగానే ఏదో ఒక రూమర్, గాసిప్...

    Disha Patani Beautiful Feast : కోటు, ప్యాంటు విప్పేసి మరీ అందాల విందు చేస్తున్న దిశా పటానీ!

    Disha Patani Beautiful Feast : బాలీవుడ్ యంగ్ అండ్ హాట్...