
ఇళయ దళపతి విజయ్ 67 వ సినిమాను కొద్దిసేపటి క్రితం అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు. ఈ చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించనున్నాడు. తమిళనాట సరికొత్త సంచలనాలను సృష్టిస్తున్నాడు ఈ యువ దర్శకుడు. లోకేష్ కనగరాజ్ తెలుగులో పలు చిత్రాలకు దర్శకత్వం వహించాలని గట్టి ప్రయత్నాలే చేసాడు. కానీ ఆ సమయంలో అతడ్ని ఎవరూ నమ్మలేదు. కట్ చేస్తే తమిళనాట మంచి అవకాశాలు వచ్చాయి. ఇక వాటిని అతడు బాగా ఉపయోగించుకున్నాడు…… విజయాలు దక్కించుకున్నాడు. దాంతో ఇప్పుడు సౌత్ లోనే స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు.

ఇటీవలే లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ చిత్రానికి దర్శకత్వం వహించి మైండ్ బ్లోయింగ్ హిట్ అందించాడు. గతకొంత కాలంగా కమల్ హాసన్ వరుస ప్లాప్ లతో అప్పులలో కురుకుపోయాడు. అలాంటి సమయంలో విక్రమ్ సినిమా 400 కోట్లకు పైగా వసూళ్లను సాధించి చరిత్ర సృష్టించింది. కట్ చేస్తే ఇళయదళపతి విజయ్ సినిమా చేసే గోల్డెన్ ఛాన్స్ లభించింది.

తమిళనాట విజయ్ కు తిరుగులేని ఇమేజ్ ఉందన్న విషయం తెలిసిందే. విజయ్ ఇటీవల నటించిన చిత్రం వారిసు. తెలుగులో వారసుడు గా విడుదల అయ్యింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 270 కోట్లకు పైగా వసూళ్లను సాధించి విజయ్ కున్న క్రేజ్ ఏంటో చాటి చెప్పింది. మాస్ హీరో ….. మాస్ డైరెక్టర్ కలిస్తే తిరుగులేని ఊర మాస్ సినిమా రావడం ఖాయం.