34.7 C
India
Friday, April 10, 2026
More

    దళపతి విజయ్ సరికొత్త రికార్డ్

    Date:

    Thalapathy Vijay Instagram
    Thalapathy Vijay Instagram

    సాధారణంగానే సోషల్ మీడియాలో కూడా స్టార్స్ రికార్డులు సెట్ చేస్తూ ఉంటారు. ఫ్యాన్స్ అంతా తమ అభిమాన హీరోలు, స్టార్స్ ని సోషల్ మీడియాలో ఫాలో అవుతూ ఉంటారు. లెటేస్ట్ గా తమిళ్ స్టార్ హీరో తలపతి విజయ్ ఇన్‌స్టాగ్రమ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.ఎంట్రీతోనే సోషల్ మీడియాలో కూడా రికార్డుల మీద రికార్డులు సృష్టించాడు. నిజం చెప్పాలంటే..సౌత్ ఇండియన్ ఫిల్మ్ స్టార్స్‌లో దళపతి విజయ్‌ ఫాలోయింగే వేరు. సాధారణంగా హీరోలకు అభిమానులు ఉంటే, తమిళనాడులో విజయ్ దళపతికి భక్తులు ఉంటారు. దక్షిణాదిన రజినీకాంత్ తర్వాత ఆ స్థాయి పాపులారిటీ కలిగిన స్టార్స్‌లో విజయ్ ముందుంటారు. విజయ్ సినిమా రిలీజ్ అయితే అభిమానులకు పండగే. రిలీజ్ రోజు థియేటర్స్ దద్దరిల్లాల్సిందే.

    ఇక విజయ్ సినిమా అప్డేట్, విజయ్ పుట్టిన రోజు, విజయ్ కి సంబంధించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా అభిమానులు ఫుల్ గా సెలబ్రేట్ చేస్తారు. ఇక ఫ్లాప్ సినిమాకు కూడా వందల కోట్ల కలెక్షన్స్ వస్తాయంటే అది అభిమానుల బలమే. అయితే ఇంతగా అభిమానుల ప్రేమను పొందిన దళపతి.. ఇన్ని రోజులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌కు దూరంగా ఉన్నారు. ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉన్నప్పటికీ.. ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం లేరు.దీంతో విజయ్ ఇన్‌స్టాగ్రామ్‌కు ఎప్పుడు వస్తారా? అని ఇంతకాలం ఈగర్‌గా వెయిట్ చేశారు ఫ్యాన్స్. మొత్తానికి వారందరి ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ ఏప్రిల్ 2న ఇన్‌స్టాగ్రామ్‌కు ఎంట్రీ ఇచ్చారు దళపతి. అంతేకాదు వస్తూ వస్తూనే తనకు అలవాటైన రికార్డ్స్ సృష్టించారు.

    ఇన్‌స్టాగ్రామ్‌‌లో హలో ఫ్రెండ్స్ అనే మొట్టమొదటి పోస్ట్‌తో ఫ్యాన్స్, ఫాలోవర్లను పలకరించారు. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న లియో చిత్రం సెట్స్ నుంచి ఓ అదిరిపోయే స్టిల్ ను షేర్ చేసుకున్నారు. సాధారణంగా బాక్సాఫీస్ వద్ద తన సినిమాలతో రికార్డ్స్ క్రియేట్ చేసే విజయ్.. ఇప్పుడు సోషల్ మీడియాలోనూ సంచలనం సృష్టించారు. తను ఇన్‌స్టా అకౌంట్ క్రియేట్ చేసిన గంటల్లోనే 1 మిలియన్ మార్క్ క్రాస్ చేశారు. ఇంతకుమందు పాపులర్ సౌత్ కొరియన్ బాయ్ బ్యాండ్ BTS..43 నిమిషాల్లో ఈ మార్క్‌ చేరకుని ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా, హాలీవుడ్ స్టార్ ఏంజెలీనా జోలీ 59 నిమిషాల్లో ఈ రికార్డ్ చేరుకుంది. . విజయ్ ఇప్పుడు 99 నిమిషాల్లో ఈ మార్క్‌ను చేరుకున్న మూడో సెలబ్రిటీగా నిలిచాడు. మూడు గంటల్లో 2 మిలియన్స్ ఫాలోవర్స్ వచ్చారు. ఇక హాఫ్ డేలో 3.7 మిలియన్స్ ఫాలోవర్స్ విజయ్ ని ఇన్‌స్టాగ్రామ్ లో ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. దీంతో చాలా తక్కువ టైంలో ఇంతమంది ఫాలోవర్స్ వచ్చిన స్టార్ గా ఇండియాలో సరికొత్త రికార్డ్ సృష్టించాడు.

     

    View this post on Instagram

     

    A post shared by Vijay (@actorvijay)

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Thalapathy Vijay : సిఏఏ అమలును వ్యతిరేకిస్తున్న దళపతి విజయ్..తమిళనాడు ప్రభుత్వానికి విజ్ఞప్తి..

    Thalapathy Vijay : దేశంలో పౌరసత్వం సవరణ చట్టం తక్షణమే అమలులోకి...

    Thalapathy Vijay : పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన తలపతి విజయ్.. ఎప్పుడంటే?

    Thalapathy Vijay : తలపతి విజయ్ తన అభిమానులకు షాక్ ఇచ్చాడు....

    ఆర్ ఆర్ ఆర్ విషయంలో హీరో విజయ్ ని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

    ఆర్ ఆర్ ఆర్ సినిమాకు ఆస్కార్ వచ్చిన విషయం తెలిసిందే. అంతటి...

    ఇళయ దళపతి  విజయ్ చిత్రానికి 400 కోట్ల బిజినెస్ ?

    ఇళయ దళపతి విజయ్ తాజాగా నటిస్తున్న చిత్రం '' లియో ''....