స్టార్ హీరోయిన్ నయనతార భర్త విఘ్నేష్ శివన్ కు షాక్ ఇచ్చాడు స్టార్ హీరో అజిత్. విఘ్నేష్ శివన్ చెప్పిన కథ అజిత్ కు నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చింది. ఈ ఫిబ్రవరిలో సినిమా ప్రారంభం కావాల్సి ఉండే కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి విఘ్నేష్ శివన్ ను తొలగించినట్లు తెలుస్తోంది.
విఘ్నేష్ శివన్ ను తొలగించడానికి ప్రధాన కారణం కథలో మార్పులు చేయాలని చిత్ర నిర్మాణ సంస్థ లైకా చెప్పడమే ! మార్పులు చెబితే అందుకు విఘ్నేష్ శివన్ ఒప్పుకోలేదని దాంతో అతడ్ని ఈ సినిమా నుండి తప్పించినట్లు తెలుస్తోంది. విఘ్నేష్ శివన్ ను తప్పించి ఆ స్థానంలో మగిళ్ తిరుమేణి అనే దర్శకుడ్ని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.
మగిళ్ చెప్పిన కథ నచ్చడంతో విఘ్నేష్ స్థానంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట. తమిళనాట అజిత్ పెద్ద హీరో అనే విషయం తెలిసిందే. అజిత్ తో సినిమా చేయాలని పలువురు దర్శకులు పోటీ పడుతుంటారు. ఇక నయనతార కూడా అందుకు సహకరించిందట. అజిత్ కు అలాగే లైకా తో విఘ్నేష్ కు వచ్చిన విబేధాలను రూపు మాపాలని నయనతార గట్టి ప్రయత్నాలే చేసిందట కానీ ఆ భామ ప్రయత్నాలు వృధానే అయ్యాయి దాంతో అజిత్ మరో దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. వచ్చే నెలలో ఈ సినిమా ప్రారంభం అవుతోంది.