ఇళయ దళపతి విజయ్ హీరోగా నటించిన వారిసు వసూళ్ల వర్షం కురిపిస్తోంది. జనవరి 11 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున వారిసు విడుదలైన విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు. తమిళంలో వారిసు టైటిల్ తో విడుదల కాగా తెలుగులో వారసుడు అనే టైటిల్ తో విడుదల అయ్యింది. అయితే తెలుగులో మాత్రం జనవరి 14 న విడుదల అయ్యింది.
విజయ్ తమిళనాట తిరుగులేని హీరో కావడంతో అక్కడ భారీ వసూళ్లు వచ్చాయి. మొత్తానికి ప్రపంచ వ్యాప్తంగా విజయ్ సినిమా 210 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక ఈ జోరు కాస్త సద్దుమణిగింది కానీ మరో 20 నుండి 40 కోట్లు వసూల్ చేయగల సత్తా ఉందని తెలుస్తోంది. అదే కనుక జరిగితే మొత్తంగా 250 కోట్ల సినిమా అవుతుంది.
విజయ్ సరసన రష్మిక మందన్న నటించగా కీలక పాత్రల్లో ప్రకాష్ రాజ్ , జయసుధ, శ్రీకాంత్ , కిక్ శ్యామ్ , శరత్ కుమార్ , యోగిబాబు తదితరులు నటించారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. తమన్ అందించిన పాటలు ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచాయి. ముఖ్యంగా రంజితమే ……. రంజితమే అనే పాట సెన్సేషన్ అయ్యింది.