ఇళయ దళపతి విజయ్ హీరోగా నటించిన వారిసు మొత్తానికి 250 కోట్ల క్లబ్ లో చేరింది. జనవరి 11 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన వారిసు చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సినిమాలో కథ , కథనం పెద్దగా లేకపోయినా విజయ్ కున్న క్రేజ్ తో ఈ భారీ వసూళ్లు వచ్చాయి. తమిళనాట విజయ్ తిరుగులేని హీరో కావడంతో పాటుగా పొంగల్ కూడా ఈ సినిమాకు బాగా కలిసి వచ్చింది. దాంతో 250 కోట్ల వసూళ్లను సాధించింది.
విజయ్ సరసన హాట్ భామ రష్మిక మందన్న నటించింది. రష్మిక మందన్న పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేదు కానీ గ్లామర్ తో అలరించింది. ఇక రంజితమే అనే పాట ట్రెండ్ సెట్ చేసింది. రష్మిక గ్లామర్ ఈ సినిమాకు కొంత ఉపయోగపడింది. ఇక కీలక పాత్రల్లో ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్ , కిక్ శ్యామ్ , యోగిబాబు , శరత్ కుమార్ తదితరులు నటించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు. వారిసు 250 కోట్ల వసూళ్లను సాధించింది కానీ అందులో 120 కోట్లు ఒక్క విజయ్ కె రెమ్యునరేషన్.
దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే అలాగే పెట్టిన పెట్టుబడులు దిల్ రాజుకు రావాలంటే మరికొన్ని వసూళ్లు సాధించాల్సిందే. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో దిల్ రాజుకు బాగానే గిట్టుబాటు అయ్యింది. శాటిలైట్ , ఓటీటీ, డిజిటల్ రైట్స్ , డబ్బింగ్ రైట్స్ రూపంలో ఇలా అన్ని భాషలు కలిపి 150 కోట్లకు పైగా వచ్చాయట. దాంతో దిల్ రాజు బాగానే సేఫ్ అయ్యాడు కాకపోతే బయ్యర్లకు మాత్రం మరిన్ని వసూళ్లు రావాల్సిందే.