
తమిళనాడులో స్టార్ హీరోలు విజయ్ , అజిత్ నటించిన రెండు చిత్రాలు వారిసు , తునివు జనవరి 11 న విడుదల అయిన విషయం తెలిసిందే. తమిళనాట ఈ ఇద్దరు కూడా స్టార్ హీరోలు కావడంతో పాటుగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నవాళ్లు కావడంతో అభిమానుల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. ఆ పోటీకి తగ్గట్లుగానే భారీ ఓపెనింగ్స్ లభించాయి ఈ రెండు చిత్రాలకు. అయితే ఈ ఇద్దరిలో ఎవరిది పైచేయి అంటే మాత్రం ఇళయ దళపతి విజయ్ దే పై చేయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
విజయ్ నటించిన వారిసు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యింది. అయితే తెలుగులో మాత్రం జనవరి 14 న విడుదల అవుతోంది. అయినప్పటికీ మొదటి రోజున దాదాపు 47 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది వారిసు చిత్రం. అయితే ఇదే సమయంలో అజిత్ నటించిన తునివు కూడా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యింది. ఈ సినిమా తెలుగులో తెగింపు అనే టైటిల్ తో విడుదల అయ్యింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 39 కోట్లు మాత్రమే వసూల్ చేసింది. దాంతో అజిత్ సినిమా కంటే విజయ్ సినిమా 8 కోట్లు ఎక్కువగా వసూల్ చేయడంతో విజయ్ ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీ గా ఉన్నారు. ఈ రెండు సినిమాలకు కూడా మిశ్రమ స్పందన లభించింది. అయితే పండగ కాబట్టి ఈ రెండు సినిమాలకు కూడా కలిసి రానుంది.






