ఇళయ దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న చిత్రం ” వారిసు ” . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరెక్కుతున్న ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతి కి విడుదల చేస్తున్నామని ఇన్నాళ్లు చెప్పారు కానీ రిలీజ్ డేట్ ను మాత్రం ప్రకటించలేదు. కట్ చేస్తే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. ఇంతకీ విజయ్ వారిసు రిలీజ్ డేట్ ఏంటో తెలుసా …… 2023 జనవరి 12 న.
అవును జనవరి 12 న ఈ చిత్రాన్ని పొంగల్ రేసులో బరిలోకి దించుతున్నాడు దిల్ రాజు. తమిళనాట విజయ్ తిరుగులేని మాస్ హీరో అనే విషయం తెలిసిందే. అలాగే ప్రపంచ వ్యాప్తంగా కూడా విజయ్ కు మంచి స్టార్ డం ఉంది. తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది కానీ ఆశించిన స్థాయిలో లేదు అనే చెప్పాలి.
తెలుగులో ఈ చిత్రాన్ని వారసుడు అనే పేరుతో విడుదల చేయనున్నాడు దిల్ రాజు. ఈ సినిమా కోసం ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి థియేటర్ లను కేటాయించాడు దిల్ రాజు. దాంతో సంక్రాంతి రేసు రసవత్తరంగా మారనుంది.