
ఇళయ దళపతి విజయ్ హీరోగా నటించిన వారిసు 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యింది. 2023 సంవత్సరంలో మొట్టమొదటి 100 కోట్ల సినిమాగా చరిత్ర సృష్టించింది వారిసు. విజయ్ హీరోగా నటించిన వారిసు తమిళనాట జనవరి 11 న విడుదలైన విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఎమోషన్స్ , ఎంటర్ టైన్ మెంట్ , యాక్షన్ కలగలిపిన సినిమాగా అక్కడ మంచి వసూళ్లను సాధిస్తోంది. దాంతో 3 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.
అయితే తెలుగులో ఈ చిత్రం వారసుడుగా విడుదల అయ్యింది. కాకపోతే జనవరి 11 న కాకుండా జనవరి 14 న విడుదల అయ్యింది. తెలుగులో ఈ చిత్రానికి పెద్దగా ఓపెనింగ్స్ లభించలేదు. కాకపోతే పండగ సెలవులు కాబట్టి మంచి వసూళ్లు వచ్చాయనే చెప్పాలి. తమిళనాట మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా విజయ్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దాంతో 3 రోజుల్లోనే 100 కోట్ల వసూళ్లను సాధించింది.
విజయ్ సరసన రష్మిక మందన్న నటించగా కీలకా పాత్రల్లో శరత్ కుమార్ , శ్రీకాంత్ , జయసుధ , యోగి బాబు , కిక్ శ్యామ్ , ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించిన విషయం తెలిసిందే. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. తమిళంలో మంచి హిట్ అయినప్పటికీ తెలుగులో మాత్రం ఆ ప్రభావం చూపించలేకపోయింది వారసుడు.