
ఇళయ దళపతి విజయ్ హీరోగా నటించిన వారిసు 150 కోట్ల వసూళ్లను సాధించింది. జనవరి 11 న భారీ ఎత్తున విడుదలైన ఈ చిత్రానికి యావరేజ్ టాక్ మాత్రమే వచ్చింది. యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ విజయ్ కున్న క్రేజ్ తో అలాగే పొంగల్ కూడా కలిసి రావడంతో భారీ వసూళ్లు సాధ్యమయ్యాయి. మొత్తానికి 6 రోజుల్లోనే 150 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టడంలో బయ్యర్లు చాలా సంతోషంగా ఉన్నారు.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే సంక్రాంతికి తెలుగులో చిరంజీవి , బాలకృష్ణ ల సినిమాలు విడుదల అవుతుండటంతో థియేటర్ ల సమస్య ఉంది కాబట్టి తన సినిమాను జనవరి 14 కు వాయిదా వేసుకున్నాడు. విజయ్ కు తెలుగులో పెద్దగా మార్కెట్ లేదు దాంతో ఇక్కడ పెద్దగా వసూళ్లు రాబట్టడం లేదు కానీ ఓ మోస్తరు ఓపెనింగ్స్ అయితే వచ్చాయి.
విజయ్ సరసన రష్మిక మందన్న నటించగా కీలక పాత్రల్లో శరత్ కుమార్ , జయసుధ , శ్రీకాంత్ , కిక్ శ్యామ్ , ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు. తమన్ సంగీతం అందించాడు. తమిళ్ లో వారిసు గా రిలీజ్ కాగా తెలుగులో వారసుడు గా వచ్చింది. వారసుడు అంతగా కలెక్ట్ చేయడం లేదు కానీ వారిసు మాత్రం బాగానే వసూల్ చేస్తోంది. దాంతో 150 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక మరో వారం కూడా ఈ సినిమాకు కలిసి రానున్నట్లు సమాచారం దాంతో మరో 50 కోట్లకు పైగానే వసూళ్లు రావచ్చని తెలుస్తోంది.