మలయాళ స్టార్ హీరో శ్రీనాథ్ భాసి చిక్కుల్లో పడ్డారు. ఓ మలయాళ సినిమా రిలీజ్ అవుతుండటంతో ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు హీరో శ్రీనాథ్ భాసి. అయితే ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ కొన్ని కోపం తెప్పించే మాటలు అనడంతో ఆవేశం తట్టుకోలేక సదరు యాంకర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసభ్యంగా ప్రవర్తించారు.
ఇంకేముంది ఆ యాంకర్ పోలీసులను ఆశ్రయించింది. హీరో శ్రీనాథ్ పై కేసు పెట్టడంతో స్పందించిన పోలీసులు హీరో శ్రీనాథ్ ను అరెస్ట్ చేసారు. హీరో తనపై అసభ్యంగా ప్రవర్తించిన వీడియో ఫుటేజ్ మొత్తం పోలీసులకు ఇవ్వడంతో హీరోపై కేసు నమోదు చేసారు. అయితే జరిగిన మొత్తం విషయం పోలీసులకు వివరించారు హీరో శ్రీనాథ్. మొత్తం విషయం అర్ధం చేసుకున్న పోలీసులు ఇరువురికి సర్దిచెప్పి పంపించారట.
అయితే హీరో శ్రీనాథ్ మాత్రం తన అరెస్ట్ ని ఖండించారు. జరిగిన గొడవ నిజమే ! కానీ అది పెద్ద విషయం కాదని అంటున్నారు హీరో శ్రీనాథ్. మలయాళంలో ” కప్పెలా ”, ” భీష్మ పర్వం ”, ”ట్రాన్స్ ” వంటి చిత్రాలతో స్టార్ హీరో అయ్యారు. తాజాగా ” చట్టంబి ” అనే చిత్రంలో నటించారు ఈ హీరో. ఆ సినిమా ప్రమోషన్ లోనే ఇలా రచ్చ జరిగింది.