మలయాళ నటి సుబి సురేష్ ఇటీవల అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. దాంతో మలయాళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా సుబి సురేష్ మరణంతో ఒక్కసారిగా ఆమె వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఆమె అనారోగ్యంతో బాధపడిన సమయంలో చేసిన ఒక వీడియో మరింతగా వైరల్ అవుతోంది.
ఇంతకీ ఆ వీడియోలో ఏముందో తెలుసా …….. తన అనారోగ్యానికి అలాగే మరణానికి కారణాలు. అవును సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్లే సుబి సురేష్ మరణించింది. అయితే ఆమె అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలోనే తనకు సోకిన అనారోగ్యం గురించి వివరించింది. దాంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
అసలు విషయం ఏంటంటే ….. చాలామంది తినడానికి సరైన తిండి లేక అవస్థలు పడుతుంటే కొంతమంది మాత్రం అన్నీ ఉండి కూడా సమయానికి తినకుండా అనారోగ్యానికి గురౌతున్నారు. సుబి సురేష్ కూడా ఇలాంటి కోవకు చెందిన మహిళ కావడం గమనార్హం. సమయానికి తినకపోవడం వల్ల సోడియం , పొటాషియం , మాగ్నీషియం లెవల్స్ క్రమంగా పడిపోయి క్రమక్రమంగా అవయవాలు పాడైపోయాయి. ఆమధ్య ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందింది కానీ లాభం లేకపోయింది. మళ్ళీ సీరియస్ కావడంతో ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతూ మరణించింది. ఆమె మరణించిన తర్వాత అంతకుముందు చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.