హీరోయిన్ అపర్ణ బాలమురళి పై చేతులు వేసి అసభ్యకరంగా ప్రవర్తించాడు ఓ వ్యక్తి. అది కూడా జనాలు బాగానే ఉన్న వేడుకలో. అపర్ణ బాలమురళి వేదిక మీద కూర్చున్న సమయంలో ఆమె దగ్గరకు ఓ వ్యక్తి వచ్చి తన చేతిలో ఉన్న ఓ పువ్వును ఇవ్వడమే కాకుండా అపర్ణ వీపుపై చేయి వేసి కౌగిలించుకునే ప్రయత్నం చేసాడు. దాంతో వెంటనే అతడి చేయి ని తీసేసి పక్కకు వెళ్ళింది.
అయితే అక్కడకు కూడా రావాలని , తాకాలని ప్రయత్నం చేసాడు. అది వేదిక కాబట్టి వెనక్కి తగ్గి ఉంటాడు. ఈ సంఘటనతో షాక్ అయిన అపర్ణ బాల మురళి తీవ్ర అవమానంగా భావించింది. చాలా ఫీల్ అయ్యింది. అయితే ఇంత తతంగం అక్కడ జరుగుతున్నప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడం దారుణం. పైగా కొంతమంది ఆకతాయిలు అయితే అపర్ణ వంటిపై చేయి వేసిన సమయంలో కేరింతలు కొట్టడం మరీ దారుణం.
అపర్ణ బాల మురళి ఆకాశమే నీ హద్దురా అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మలయాళ హీరోయిన్ అయిన అపర్ణ బాల మురళి పలు చిత్రాల్లో నటించింది. తమిళంలో నటించిన సూరై పొట్రు అనే చిత్రంలోని నటనకు గాను జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఎక్కువగా మలయాళ చిత్రాల్లో నటిస్తూ ఉంటుంది. నిండు సభలో తనకు అవమానం జరగడంతో చాలా ఇబ్బందిగా భావిస్తోంది.