నటుడ్ని వేధించిన కేసులో ఓ మహిళా డైరెక్టర్ అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. మలయాళ చిత్ర రంగానికి చెందిన ఈ సంఘటన సంచలనం సృష్టిస్తోంది. లక్ష్మీ దీప అనే మహిళా డైరెక్టర్ ఓ వెబ్ సిరీస్ కోసం ఓ నటుడ్ని సంప్రదించింది. ఇందులో రకరకాల సన్నివేశాలు ఉంటాయని చెప్పి అగ్రిమెంట్ చేసుకుంది.
అయితే ఆ వెబ్ సిరీస్ లో దారుణమైన అసభ్యకరమైన సన్నివేశాలు ఉన్నాయట. దాంతో నేను ఇలాంటి అసభ్యకరమైన సన్నివేశాల్లో నటించను అని తెగేసి చెప్పాడట ఆ నటుడు. అయితే అగ్రిమెంట్ చేసావ్ కాబట్టి చేయాల్సిందే లేకపోతే ఊరుకునేది లేదు అంటూ వేధించడంతో ఆ అభ్యంతకరమైన సన్నివేశాల్లో నటించాడట.
ఆ సన్నివేశాలు చిత్రీకరణ అయ్యాక పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టాడట. కానీ పోలీసులు పట్టించుకోలేదు దాంతో కేరళ కోర్టును ఆశ్రయించాడు ఆ నటుడు. ఇంకేముంది అన్ని వివరాలు పరిశీలించిన కోర్టు వెంటనే కేసు నమోదు చేసి లక్ష్మీ దీపను అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దాంతో కేసు పెట్టిన పోలీసులు లక్ష్మీ దీపను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇప్పుడు ఈ కేసు సంచలనంగా మారింది. మాములుగా అయితే మహిళల పట్ల మగవాళ్ళ వేధింపులు అనే వార్త చూస్తాం ……. కానీ అందుకు భిన్నంగా ఓ మహిళ ఓ నటుడ్ని వేధించడం సంచలనంగా మారింది.