మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది ” ఎలోన్ ” అనే చిత్రం. షాజీ కైలాష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 26 న భారీ ఎత్తున విడుదల అయ్యింది. మోహన్ లాల్ సినిమాలకు మళయాళంలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా మంచి ఆదరణ లభిస్తుంది. అయితే ఎలోన్ మాత్రం మోహన్ లాల్ కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ గా నిలవడంతో బయ్యర్లు ఘోరంగా నష్టపోతున్నారు.
మలయాళంలో మోహన్ లాల్ స్టార్ హీరో దాంతో కనీస ఓపెనింగ్స్ ఉంటాయి. కానీ ఈ సినిమాకు ఓపెనింగ్స్ లేకపోవడం గమనార్హం. షాజీ కైలాష్ కూడా ఒకప్పుడు బ్లాక్ బస్టర్ లను అందించిన దర్శకుడు కానీ ఇక్కడ ఆ మ్యాజిక్ కూడా పనిచేయలేదు. ఇప్పటి వరకు ఈ సినిమా కనీసం కోటి రూపాయల వసూళ్లను కూడా సాధించలేక బాక్సాఫీస్ వద్ద చతికిలబడింది. మోహన్ లాల్ నటించిన పలు సూపర్ హిట్ చిత్రాలు తెలుగులో డబ్ అయ్యాయి అలాగే రీమేక్ కూడా అయ్యాయి.