25.3 C
India
Tuesday, July 16, 2024
More

  మోహన్ లాల్ తో ఏడాదికో సినిమా చేయాలని ఉంది – హీరోయిన్ మంచు లక్ష్మి

  Date:

   wants to do a film with Mohanlal every year - Heroine Manchu Lakshmi
  wants to do a film with Mohanlal every year – Heroine Manchu Lakshmi

  మోహన్ లాల్ హీరోగా నటించిన ఫిల్మ్ మాన్ స్టర్. ఈ చిత్రంలో మంచు లక్ష్మి కీలక పాత్రను పోషించింది. మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు వైసక్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా విశేషాలను తాజా ఇంటర్వ్యూలో తెలిపింది నటి మంచు లక్ష్మి ఆమె మాట్లాడుతూ….

  – ఈ చిత్రంలో నేను మంజు దుర్గ అనే పాత్రలో నటించాను. చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు నాకు చెప్పిన క్యారెక్టర్ చెప్పినట్లు రూపొందిస్తారా లేదా అనే అనుమానం ఉండేది. ఎందుకంటే స్క్రిప్ట్ దశలో చెప్పిన క్యారెక్టర్ చివరకు సినిమాలో ఉండదు. లక్కీగా నా క్యారెక్టర్ వరకు ఎలాంటి సీన్స్ తీసేయలేదు.

  – మలయాళంలో నటిస్తున్నప్పుడు భాష పరంగా ఇబ్బందులు పడ్డాను. ఆ డైలాగ్స్ మనలా ఉండవు, చాలా లెంగ్తీ డైలాగ్స్ ఇచ్చారు. నేను చాలా ఎనర్జిటిక్ గా సెట్స్ కు వెళ్తే, డల్ గా ఉండాలి మీ క్యారెక్టర్ అని చెప్పేవారు. ఈ పాత్ర మూడ్ ను, లాంగ్వేజ్ ను అర్థం చేసుకునేందుకు కొంత టైమ్ పట్టింది.

  – మోహన్ లాల్ ఒక లెజెండరీ నటుడు. ఆయన నటుడిగానే కాక బహుముఖ ప్రజ్ఞాశాలి. తెరపై ఎన్నో ప్రయోగాలు చేశారాయన. ఇప్పటికీ తన కెరీర్ లో చాలెంజింగ్ మూవీస్ చేస్తున్నారు. మీతో సంవత్సరానికి ఒక సినిమాలో అయినా నటించాలని ఉందని నేను ఆయనతో అన్నాను. కెరీర్ లో ఇప్పుడు ఆయన ఉన్న స్జేజ్ లో నాకెందుకు ఇలాంటి వివాదాస్పద సబ్జెక్ట్ అనుకోవచ్చు కానీ ఆయన సవాళ్లు స్వీకరిస్తారు.

  – నా దృష్టిలో ప్రేమకు లింగ, ప్రాంత, కుల, మత బేధాలు లేవు. ఎవరైనా ఇద్దరి మనుషుల మధ్య ప్రేమ ఉండొచ్చు. ఫలానా వ్యక్తినే ప్రేమించాలని చెప్పే హక్కు ఎవరికీ లేదు.

  – ట్రోల్స్ ను, మీమ్స్ ఎంజాయ్ చే్స్తుంటా. వాళ్లకు ఇంకేదేనా కొత్తగా క్రియేట్ చేసేందుకు క్లూ ఇవ్వాలని చూస్తుంటా. నటిగా కంటే టీవీ కార్యక్రమాల్లో నన్ను నేనుగా ప్రేక్షకులకు చూపించుకోగలుగుతాను. ప్రస్తుతం గాంబ్లర్, లేచింది మహిళా లోకం, అగ్ని నక్షత్రం తదితర చిత్రాల్లో నటిస్తున్నాను.

  Share post:

  More like this
  Related

  Pawan : పాలనలో తన మార్కు చూపిస్తున్న పవన్.. లక్ష కోట్ల ఆదాయం ఉండే కంపెనీ కోసం పోరాటం!

  Pawan : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘన విజయం...

  CM Relief Fund : ఆన్‌లైన్‌లో మొదలైన సీఎం సహాయనిధి దరఖాస్తులు

  CM Relief Fund : రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....

  AP Government : వైసీపీ మెడకు మరో ఉచ్చు? ఏపీ సర్కార్ నివేదిక కోరిన సుప్రీంకోర్టు..!

  AP Government మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వరుస షాకులు...

  Anchor Rashmi : ఆ ఘటనపై యాంకర్ రష్మీ సంచలన స్టేట్మెంట్.. మద్దతిచ్చిన నెటిజన్లు..

  Anchor Rashmi : యాంకర్ ‘రష్మీ గౌతమ్’ గురించి ప్రత్యేకంగా పరిచయం...

  POLLS

  [yop_poll id="2"]

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  Manchu Family : మంచు ఫ్యామిలీలో తారస్థాయికి విభేదాలు

  Manchu Family : మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో విభేదాలు తారస్థాయి...

  Manchu Lakshmi : నన్ను అన్యాయం చేశారు.. తండ్రి మోహన్ బాబుపై మంచు లక్ష్మి కామెంట్స్

  Manchu Lakshmi : సీనియర్ యాక్టర్ మంచు మోహన్ బాబు కూతురు,...

  Actor Mohanlal : మోహన్ లాల్ నటిస్తే అవార్డుల పంటే.. విలక్షణ నటుడి బర్త్ డే స్పెషల్ స్టోరీ

  Actor Mohanlal : మోహన్ లాల్ సుప్రసిద్ధ నటుడు.  మోహన్ లాల్...

  Manchu Lakshmi : పొట్టి బట్టల్లో చెలరేగిపోతున్న మంచు లక్ష్మి

  Manchu Lakshmi : తెలుగులో మంచు లక్ష్మి అంటే తెలియని వారు...