38.7 C
India
Thursday, June 1, 2023
More

    Munnabhai : ‘హీరో’ను మిస్సయిన మున్నాభాయ్

    Date:

    Munnabhai
    Munnabhai

    బాలీవుడ్ లో  విజయపతాకాన్ని ఎగురవేసిన  సినిమాలు చాలానే ఉన్నాయి. ఒక్క సినిమా ఒక హీరో కెరీర్ ను మార్చేసింది. బాలీవుడ్ సూపర్ డూపర్ హిట్లలలో ఒకటి 1983 లో వచ్చిన హీరో  సినిమా ఒకటి. ఈ సినిమాకు సుభాష్ ఘాయ్ దర్శకత్వం వహించారు. జాకీ ష్రాఫ్ ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత మరెన్నో సూపర్‌హిట్ చిత్రాల్లో హీరోగా నటించాడు. కానీ ఈ చిత్రానికి మేకర్స్ మొదటి ఎంపిక జాకీ ష్రాఫ్ కాదు. సుభాష్ మొదట ఈ సినిమాలో తన ఫేవరెట్ స్టార్ ని తీసుకోవాలని అనుకున్నాడు. కానీ అతని ప్రవర్తనతో తీరుతో హీరో సినిమా కాస్టింగ్ మార్చాల్సి వచ్చింది.

    సుభాష్ ఘాయ్ బాలీవుడ్ కు ఎన్నో సూపర్ హిట్లను అందించాడు.  అందులో ‘హీరో’, ‘జంగ్ కర్మ’, ‘రామ్ లఖన్’, ‘సౌదాగర్’, ‘ఖల్నాయక్’, ‘పర్దేస్’ ‘తాల్’ వంటి చిత్రాలు ఉన్నాయి.  దర్శకుడిగా ఎంత కచ్చితంగా ఉంటాడో, కాస్టింగ్ డైరెక్టర్‌గా కూడా అంతే కచ్చితంగా ఉంటాడు. ఇండస్ట్రీకి ఎందరో నటుల్ని పరిచయం చేసి నిలబెట్టాడు. అయితే జాకీష్రాఫ్ లీడ్ రోల్ పోషించిన  హీరో సినిమా కు జాకీ ఫస్ట్ ఆప్షన్ కాదు. ఈ రోల్ కోసం మరో హీరోని అనుకున్నాడట.

    అప్పటికే సంజయ్ దత్ హీరోగా విధాత చిత్రం షూటింగ్ లో ఉంది. తన తదుపరి చిత్రం హీరో కోసం సంజయ్ నే తీసుకోవాలనుకున్నాడు. అప్పటికే సంజయ్ దత్ డ్రగ్ అడిక్షన్ కారణంగా విధాత షూటింగ్ సమయంలో  షూటింగ్ కు ఆలస్యంగా వచ్చేవాడు.  ప్రముఖ నటులు షమ్మీ కపూర్, దిలీప్ కుమార్ సంజయ్ కోసం సెట్స్‌లో  చాలా సేపు వేచి ఉండాల్సి  వచ్చేది. కొన్నిసార్లు షూటింగ్ రద్దు చేసిన సందర్భాలూ ఉన్నాయి.  ఎలాగోలా సుభాష్ ఘాయ్ సంజయ్ దత్ తో ‘విధాత’ సినిమా పూర్తి చేశాడు. సంజయ్ దత్ ప్రవర్తనతో విసిగి పోయిన సుభాష్ ఘాయ్ ‘హీరో’లో  జాకీ ష్రాఫ్ ని పెట్టేశాడు.
    ఓవర్ నైట్ స్టార్  ’హీరో‘

    1983లో వచ్చిన ‘హీరో’ సినిమా ఆ ఏడాది సూపర్  హిట్‌గా నిలిచింది. హీరో చిత్రంలో జాకీ సరసన మీనాక్షి శేషాద్రి హీరోయిన్ గా కనిపించింది. ఈ చిత్రం 1983లో బాక్సాఫీస్ కలెక్షన్ లిస్ట్‌లో మూడో స్థానంలో నిలిచింది. ఈ చిత్రం తో జాకీ ష్రాఫ్ కెరీర్ గ్రాఫ్ కూడా పెరుగతూ వచ్చింది. సుభాష్ ఘాయ్‌కి సంజయ్ దత్ నటన బాగా నచ్చిందని, అందుకు అతడిని ‘హీరో’ సినిమాలో తీసుకోవాలనుకున్నాడు. కానీ విధాత షూటింగ్ టైమ్ లో సంజు  ప్రవర్తన చూసి మనసు మార్చుకోక తప్పలేదు.

    Share post:

    More like this
    Related

    మనం వాడే టైర్లు రీసైకిల్ చేయొచ్చా.. కువైట్ లో వీటిని ఏం చేశారు..?

      ఇప్పుడు వాడుతున్న ప్రతి వాహనానికి టైర్లు కీలకం. అయితే ఇవి వాడేసిన...

    ఆవుపాలు ఆరోగ్యానికి ఎంత మంచివో తెలుసా?

      మనం రోజు పాలు తాగుతుంటాం. పాలలో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల...

    మరోసారి పూనకాలు లోడింగ్ అనేలా చిరు వింటేజ్ లుక్.. భోళా ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే?

    మెగాస్టార్ చిరంజీవి భోళా మ్యానియా స్టార్ట్ అవ్వనుంది నుండి కొన్ని రోజుల...

    సునీల్ కనుగోలు కు బంపర్ ఆఫర్… ఏకంగా క్యాబినెట్ హోదా..!

    కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరింది.   భారీ విజయం సాధించడంతో అధికారంలోకి...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    షూటింగ్ లో పేలిన బాంబ్ : గాయపడిన స్టార్ హీరో

    షూటింగ్ లో ఓ బాంబ్ పేలడంతో స్టార్ హీరో సంజయ్ దత్...

    దళపతి విజయ్ టైటిల్ రివీల్ అయిందిగా

    ఇళయ దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి టైటిల్ ఖరారు...

    విజయ్ కొత్త సినిమా ప్రారంభం

    ఇళయదళపతి విజయ్ కొత్త సినిమా పూజా కార్యక్రమాలు ఈరోజు చెన్నై లో...