ఒకవైపున టాలీవుడ్ లో సినిమా షూటింగ్ లన్నీ ఆగిపోయాయి. షూటింగ్ లు ఆపేసి 15 రోజులు కావస్తోంది. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో తెలియడం లేదు. అంతా అదే అనుకుంటున్నారు కానీ నందమూరి బాలకృష్ణ మాత్రం తన షూటింగ్ ని నిర్విరామంగా హైదరాబాద్ లో చేస్తున్నాడు. అదేంటి తెలుగు సినిమాల షూటింగ్ లు బంద్ కదా …… మరి బాలయ్య షూటింగ్ చేయడం ఏంటి ? అనుకుంటున్నారా ?
బందా ….. నా బొంగా అంటూ బాలయ్య తన సినిమా షూటింగ్ కానిచ్చేస్తున్నాడు. బాలయ్య సినిమా షూటింగ్ ని ఆపేసే దమ్ము ఎవరికైనా ఉందా ? లేదు కదా ! పైగా ప్లాప్ లు , బడ్జెట్ ఎక్కువ అవ్వడం లాంటి సమస్య బాలయ్య సినిమాలకు లేదు కాబట్టి ఆ నిర్ణయాలు ఎవరు తీసుకుంటారో తీసుకోనివ్వండి ……. మన షూటింగ్ మనం చేసుకుందాం అంటూ దర్శక నిర్మాతలకు చెప్పాడట బాలయ్య.
దాంతో తప్పదుకదా ! దర్శక నిర్మాతలు కదిలారు …… 107 వ చిత్రం ఎంచక్కా హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. బాలయ్య 107 వ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న సంగతి తెల్సిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా వరలక్ష్మీ శరత్ కుమార్ , దునియా విజయ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేయాలని అనుకున్నారు కానీ 2023 సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Breaking News