
స్వాతి రెడ్డి అనే ఎన్నారై భామకు సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఎక్కువగా ఉంది. అయితే ఎవరిని కలవాలి , ఎక్కడకు వెళ్ళాలి …… ఎవరిని కలిస్తే అవకాశాలు వస్తాయనే విషయం తెలియక సతమతం అవుతున్న సమయంలో hystar app గురించి తెలుసుకుంది. సినిమారంగంలోని 24 శాఖలకు సంబంధించిన ప్రొఫైల్ లను సమగ్రంగా రూపొందించిన యాప్ కావడంతో తన వివరాలు అందులో పొందు పరిచింది. ఇంకేముంది అవకాశాలు స్వాతి రెడ్డి ని వెతుక్కుంటూ వచ్చాయి. ఓ ఎన్నారై ప్రొడ్యూసర్ అమెరికాలో కాక్ టెయిల్ డైరీస్ అనే సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. కాగా ఆ సినిమాలో స్వాతి రెడ్డికి అవకాశం లభించింది. దాంతో చాలా ఆనందంగా ఉంది ఈ భామ.
