Pawan’s first Instagram post మన టాలీవుడ్ లో ఇంస్టాగ్రామ్ లోకి ఇటీవలే పవర్ స్టార్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. అయితే ఈయన ఎంట్రీ ఇచ్చిన కూడా ఒక్క పోస్ట్ లేకుండానే 2.4 మిలియన్ ఫాలోవర్స్ ను అందుకుని రికార్డ్ క్రియేట్ చేసాడు.. ఇక ఇప్పుడు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే సమయం ఆసన్నం అయ్యింది..
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు అంతా ఎప్పుడెప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి పోస్ట్ చేస్తాడు? ఏం పోస్ట్ చేస్తాడా అని ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. మరి ఆ రోజు వచ్చేసింది.. పవన్ ఇంస్టాగ్రామ్ లో మొదటి పోస్ట్ చేసారు. అది కూడా ఎంతో భావిద్వేగంగా ఎమోషనల్ పోస్ట్ చెయ్యడంతో అది కాస్త క్షణాల్లోనే వైరల్ అయ్యింది.
పవన్ కళ్యాణ్ పెట్టిన మొదటి పోస్ట్ ఏంటి అంటే.. నిన్న సాయంత్రం జులై 15న పవన్ కళ్యాణ్ ఇంస్టాగ్రామ్ లో తొలి పోస్ట్ చేసారు.. తన మొదటి పోస్ట్ లో సినిమాలకు సంబంధించిన ఆయన ప్రయాణాన్ని సూచిస్తూ ఈయన కెరీర్ మొదటి నుండి గొప్పగొప్ప వారితో సాగిన ప్రయాణం ఈ పోస్ట్ ద్వారా తెలిపారు.
ఈ పోస్ట్ మొత్తం భావోద్వేగంగా సాగింది. ఇంస్టాగ్రామ్ లో వీడియో షేర్ చేసిన పవన్.. ”మన బంధం ఇలానే కొనసాగాలని, మరెన్నో మధురమైన జ్ఞాపకాల్ని పంచుకోవాలని ఆశిస్తూ”.. అంటూ ఒక వీడియో షేర్ చేసారు. ఈ వీడియోలో పవన్ తో కలిసి దిగిన టాలీవుడ్ ప్రముఖులు కనిపించారు..
టాప్ స్టార్స్ తో పాటు కమెడియన్స్, డైరెక్టర్లు, కమెడియన్స్, కొరియోగ్రాఫర్స్ ఇలా ఎంతో మంది కనిపించదు. మరి మొదటి పోస్ట్ తోనే సినీ పరిశ్రమపై తనకు ఉన్న అభిమానాన్ని చూపించారు.. ఈ పరిశ్రమలో ఎంతో మంది ప్రతిభావంతులతో, నిరాడంబరమైన వ్యక్తులతో కలిసి ప్రయాణిస్తున్నందుకు కృతజ్ఞతలు అంటూ తెలిపారు.
View this post on Instagram