30.2 C
India
Thursday, April 25, 2024
More

    ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం రివ్యూ

    Date:

    itlu maredumilli prajaneekam review
    itlu maredumilli prajaneekam review

    నటీనటులు : అల్లరి నరేష్ , ఆనంది , వెన్నెల కిషోర్

    సంగీతం : సాయిచరణ్ పాకాల

    నిర్మాత : రాజేష్ దండు

    దర్శకత్వం : ఏ ఆర్ మోహన్

    విడుదల తేదీ : 25 నవంబర్ 2023

    రేటింగ్ : 3/5

    అల్లరి నరేష్ హీరోగా ఏ ఆర్ మోహన్ దర్శకత్వంలో రాజేష్ దండు నిర్మించిన చిత్రం ” ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ”. నవంబర్ 25 న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

    కథ :

    దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న గ్రామం ” మారేడుమిల్లి ”. ఆ ఊళ్ళో ఆసుపత్రి కానీ బడి కానీ లేదు. దాంతో ఆ గ్రామంలోని ప్రజలు ఓట్లు వేయకుండా తమ నిరసన వ్యక్తం చేస్తుంటారు. అలాంటి చోటుకు ఎలక్షన్ డ్యూటీ మీద వస్తాడు శ్రీపాద శ్రీనివాస్ ( అల్లరి నరేష్ ) అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అయితే మారేడుమిల్లి ప్రజానీకం మాత్రం ఓట్లు వేయడానికి నిరాకరిస్తారు. దాంతో ఆ గ్రామానికి చెందిన లక్ష్మీ ( ఆనంది ) సహాయంతో ప్రజలను ఓటేసేలా చేస్తాడు. మొదటిసారిగా మారేడుమిల్లిలో ఓట్లు పడటంతో పోలింగ్ సిబ్బందిని కిడ్నాప్ చేస్తుంది తండాకు చెందిన బ్యాచ్. దాంతో వాళ్ళను విడిపించడానికి ఏం చేసారు ? చివరకు ఏమైంది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    హైలెట్స్ :

    అల్లరి నరేష్

    కామెడీ

    విజువల్స్

    నేపథ్య సంగీతం

    డ్రా బ్యాక్స్ :

    రొటీన్ కథ

    నటీనటుల ప్రతిభ :

    శ్రీపాద శ్రీనివాస్ పాత్రలో అల్లరి నరేష్ ఒదిగిపోయాడు. ఒకప్పుడు అల్లరి పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అల్లరి నరేష్ ఇటీవల కాలంలో సీరియస్ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అదే కోవలో ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం చిత్రాన్ని చేసి మరోసారి మెప్పించాడు. ఇక వెన్నెల కిషోర్ , ప్రవీణ్ , రఘుబాబు లు కామెడీతో అలరించారు. ఆనంది పక్కా పల్లెటూరు అమ్మాయిగా నటించి తన ప్రత్యేకత చాటుకుంది.

    సాంకేతిక వర్గం :

    గ్రామీణ వాతావరణంలో రూపొందిన చిత్రం కావడంతో విజువల్స్ అద్భుతంగా వచ్చాయి. చోటా కె ప్రసాద్ అద్భుతమైన విజువల్స్ అందించాడు. శ్రీచరణ్ పాకాల అందించిన పాటలు బాగున్నాయి అయితే నేపథ్య సంగీతం మరింతగా సినిమాను ఎలివేట్ అయ్యేలా చేసింది. నిర్మాత ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇక దర్శకుడు ఏ ఆర్ మోహన్ ఈ చిత్రాన్ని మంచి సందేశంతో ఆకట్టుకునేలా రూపొందించాడు.

    ఓవరాల్ గా :

    మారేడుమిల్లి ప్రజానీకం తప్పకుండా చూడాల్సిన సినిమా. 

    Share post:

    More like this
    Related

    Tillu Cube Director : టిల్లూ ఫ్రాంచైజీ నుంచి కొత్త న్యూస్.. ‘టిల్లు క్యూబ్’కు డైరెక్టర్ ఇతనే..

    Tillu Cube Director : 2022 ప్రీక్వెల్ ‘డీజే టిల్లు’ మార్కును...

    Pushpa 2 First single : పుష్ప 2: ది రూల్: ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది

    Pushpa 2 First single : అల్లు అర్జున్ నటించిన పుష్ప...

    CM Ramesh : బీఆర్ఎస్ కంటే వైసీపీ వేగంగా ఖాళీ.. సీఎం రమేశ్ సంచలన కామెంట్..

    CM Ramesh : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఏక...

    Counselor Camp : ఏప్రిల్ 27న వర్జీనియాలో కౌన్సిలర్ క్యాంప్

    Counselor Camp : భారత రాయబార కార్యాలయం, వాషింగ్టన్ DC VFS...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Allari Naresh : రజినీకాంత్ కోడలితో అల్లరి నరేష్ రొమాన్స్..జనాలు చూస్తే ఏమైపోతారో!

    Allari Naresh : ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

    MM Keeravani : ఫ్రెండ్ షిప్ కు కీరవాణి మ్యాజికల్ టచ్.. సాంగ్ అదుర్స్..

    MM Keeravani : చాలా కాలం తర్వాత కింగ్ నాగార్జున వెండితెరపై...

    Allari Naresh : నీ సినిమాలు ఆపకపోతే నీ అంతు చూస్తా.. అల్లరి నరేష్ కు ఆ నటుడి వార్ణింగ్!

    Allari Naresh : అల్లరి నరేష్ కామెడీ హీరోగా తనకంటూ స్పెషల్...

    celebrities : సినిమాల పేర్లనే ఇంటి పేరుగా పెట్టుకున్న ఫేమస్ సెలెబ్రిటీలు వీరే!

    celebrities సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు.. అయితే కొంత...