హీరోయిన్ రితికా సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ” ఇన్ కార్ ”. హర్షవర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రితికా సింగ్ కు తమిళంలో అలాగే తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉండటంతో ఇన్ కార్ చిత్రాన్ని సౌత్ లో విడుదల చేసారు. ఓ ముగ్గురు రౌడీలు కారును కిడ్నాప్ చేసి అదే సమయంలో బస్టాప్ లో ఉన్న రితికా సింగ్ ను కూడా కిడ్నాప్ చేస్తారు.
ఆమెను అనుభవించాలని ముగ్గురు రౌడీలు చేసిన ప్రయత్నాలు ఏంటి ? ఆ ముగ్గురు రౌడీల నుండి తనని తాను కాపాడుకోవడానికి రితికా సింగ్ ఏం చేసింది. చివరకు ఏమైంది అనే కథాంశంతో ఇన్ కార్ చిత్రం రూపొందింది. లైన్ బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సినిమా అంతగా పేలలేదు.
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన గురు చిత్రంలో హీరోయిన్ గా నటించింది రితికా సింగ్. ఆ సినిమా తర్వాత ఈ భామ కొన్ని చిత్రాల్లో నటించింది కానీ అవి అంతగా ఆడలేదు. కొంత గ్యాప్ తీసుకొని చేసిన ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించేలా కనబడటం లేదు. ఈరోజు విడుదలైన ఇన్ కార్ చిరితికా సింగ్ ఇన్ కార్ మినీ రివ్యూత్రానికి డివైడ్ టాక్ వచ్చింది.