
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ వేదిక మీదే కన్నీళ్లు పెట్టుకున్నాడు దాంతో నందమూరి బాలకృష్ణ శివరాజ్ కుమార్ ను ఓదార్చాడు. ఈ సంఘటన పలువురిని తీవ్రంగా కలిచివేసింది. ఇంతకీ కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడో తెలుసా ? ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసా ?
హైదరాబాద్ లో వేద సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. కాగా ఆ వేడుకలో శివరాజ్ కుమార్ , నందమూరి బాలకృష్ణ లు పాల్గొన్నారు. సినిమాల గురించి మాట్లాడుతున్న సమయంలో ఇటీవల మరణించిన స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ గురించి ప్రస్తావన వచ్చింది. అంతే ఒక్కసారిగా తన తమ్ముడ్ని తలుచుకొని తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాడు శివరాజ్ కుమార్. దాంతో బాలయ్య శివరాజ్ కుమార్ ను ఓదార్చాడు. ఈ సంఘటన వేద ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన వాళ్లందరినీ ఉద్వేగానికి లోనయ్యేలా చేసింది. నందమూరి కుటుంబానికి రాజ్ కుమార్ కుటుంబానికి చాలా సంవత్సరాలుగా అవినాభావ సంబంధం ఉందనే విషయం తెలిసిందే.
కన్నడంలో సూపర్ స్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్నాడు శివరాజ్ కుమార్. అలాగే శివరాజ్ కుమార్ తమ్ముడు పునీత్ రాజ్ కుమార్ పవర్ స్టార్ గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. హీరోగా ఎంతటి సంచలనం సృష్టించాడో గొప్ప మానవతావాదిగా కూడా పలు సేవా కార్యక్రమాలు చేసి గొప్ప వ్యక్తిగా నిలిచాడు. అయితే కేవలం 46 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. దాంతో కర్ణాటక శోకసంద్రంలో మునిగింది. తన తమ్ముడు అర్దాంతరంగా మరణించడంతో వేద ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఇక వేద చిత్రం విషయానికి వస్తే ……. ఇది శివరాజ్ కుమార్ కు 125 వ సినిమా. కన్నడంలో ఏ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దాంతో తెలుగులో డబ్ చేస్తున్నారు. ఇటీవల పలు కన్నడ చిత్రాలు పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. దాంతో ఇకపై నేను నటించే ప్రతీ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తానని స్పష్టం చేసాడు శివరాజ్ కుమార్.