KGF 1 , KGF 2 చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త చరిత్ర సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ కు ఎక్కడాలేని కష్టాలు వచ్చి పడ్డాయి దాంతో తన ట్విట్టర్ ఖాతా క్లోజ్ చేసాడు. ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన సినిమాలను అందించిన ప్రశాంత్ నీల్ కు వచ్చిన కష్టాలు ఏంటి ? అని అనుకుంటున్నారా ? ఇందుకు కారణం ఏంటంటే ……. యష్ అభిమానులే కారణం.
కన్నడంలో ఓ మాములు హీరోగా ఉన్న యష్ ను పాన్ ఇండియా స్టార్ ని చేసింది ప్రశాంత్ నీల్. అలాంటిది యష్ ఫ్యాన్స్ ప్రశాంత్ నీల్ ను టార్గెట్ చేయడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? అసలు విషయం ఏంటంటే ……. జనవరి 8 న యష్ పుట్టినరోజు. దాంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని యష్ కు ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు ప్రశాంత్ నీల్.
అయితే కన్నడ భాషలో ట్వీట్ చేయకుండా ఉర్దూలో యష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. అదే కోపానికి కారణమయ్యింది. ఓ కన్నడ కుటుంబానికి చెందిన నువ్వు ఉర్దూలో ట్వీట్ చేయడం ఏంటి ? అని యష్ అభిమానులు , కన్నడిగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎంతగా అంటే ఆ దెబ్బకు ట్విట్టర్ ఖాతా క్లోజ్ అయ్యేలా.
తాత్కాలికంగా ప్రశాంత్ నీల్ ట్విట్టర్ ఖాతా క్లోజ్ అయ్యింది. ఈ వివాదం సద్దుమణిగిన తర్వాత యధావిధిగా ట్విట్టర్ ఖాతా పని చేయనుంది. ఇక ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ ” సలార్ ” అనే సినిమా చేస్తున్నాడు. అది అయ్యాక ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నాడు.