
కన్నడ హీరో దర్శన్ పై పునీత్ రాజ్ కుమార్ అభిమాని చెప్పు విసిరిన సంఘటన కలకలం సృష్టించింది. ఈ సంచలన సంఘటన కర్ణాటకలో జరిగింది. కన్నడ స్టార్ హీరో దర్శన్ తాజాగా తన సినిమా ప్రమోషన్ కోసం హొస్పెట వెళ్ళాడు. కాగా అక్కడకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. తనని చూడటానికి వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తున్న సమయంలో పునీత్ రాజ్ కుమార్ అభిమాని ఒకరు చెప్పు విసిరాడు. సరిగ్గా అది దర్శన్ కు తగిలింది దాంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.
దర్శన్ కు భద్రత కల్పిస్తున్న పోలీసులు వెంటనే అతడ్ని పట్టుకున్నారు. అయితే అతడ్ని వదిలి వేయాలని , ఓ చిన్న సంఘటన ఇది కాబట్టి దీన్ని పెద్దది చేయొద్దు అని చెప్పాడట. ఇక ఈ సంఘటన పునీత్ రాజ్ కుమార్ అన్న శివరాజ్ కుమార్ కు తెలియడంతో చాలా బాధపడ్డాడు. ఇలాంటి సంఘటనలు మంచివి కావని హితువు పలికాడు. అంతేకాదు ఓ వీడీయో కూడా విడుదల చేసాడు.
దర్శన్ జీవితం సాఫీగా సాగడం లేదు. ఇప్పటికే పలు వివాదాలు ఈ హీరోను చుట్టుముట్టాయి. గత ఏడాది పునీత్ రాజ్ కుమార్ మరణించిన సంగతి తెలిసిందే. అయితే పునీత్ రాజ్ కుమార్ పై అనవసరమైన వ్యాఖ్యలు చేసాడని దర్శన్ మీద చాలా ఆగ్రహంగా ఉన్నారు పునీత్ అభిమానులు. కన్నడంలో పునీత్ రాజ్ కుమార్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఆయన చనిపోయినప్పటికీ అభిమానం మాత్రం తగ్గలేదు.