22.2 C
India
Saturday, February 8, 2025
More

    “బాలుగాడి లవ్ స్టోరీ” టీజర్ ను విడుదల చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్

    Date:

    Thalasani Srinivas Yadav released the teaser of Balugadi Love Story
    Thalasani Srinivas Yadav released the teaser of Balugadi Love Story

    దర్శకులు సముద్ర చేతుల మీదుగా లాంచ్ అయిన “బాలుగాడి లవ్ స్టోరీ” మోషన్ పోస్టర్

    శ్రీ ఆకుల భాస్కర్ సమర్పణలో భామ క్రియేషన్స్ పతాకంపై ఆకుల అఖిల్, దర్శక మీనన్, చిత్రం శ్రీను, జబర్దస్త్ గడ్డం నవీన్, జబర్దస్త్ చిట్టిబాబు, రేవతి నటీ నటులుగా యల్. శ్రీనివాస్ తేజ్ ను దర్శకునిగా పరిచయం చేస్తూ ఆకుల మంజుల నిర్మిస్తున్న చిత్రం “బాలుగాడి లవ్ స్టోరీ”. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఒక సాంగ్ మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది.ఈ కార్యక్రమంలో ముందుగా విడియో బైట్ ద్వారా సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు విడుదల చేసిన చిత్ర టీజర్ ను పాత్రికేయ మిత్రులకు ప్రదర్శించడం జరిగింది. టీజర్ లాంచ్ అనంతరం ముఖ్య అతిధిగా వచ్చిన దర్శకులు సముద్ర గారు చిత్ర మోషన్ పోస్టర్ ను లాంచ్ చేయడం జరిగింది.ఇంకా ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హరి గౌడ్, శ్రీహరి గౌడ్, రెవలాన్స్ కాస్మటిక్స్ సౌత్ ఇండియా ఇన్చార్జి మహేష్, చిందం మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

    అనంతరం దర్శకులు సముద్ర మాట్లాడుతూ…”బాలు గాడి లవ్ స్టోరీ” టీజర్ చాలా బాగుంది. నటీ నటులు కొత్తవరైనా చాలా బాగా నటించారు. దర్శకుడు కొత్త వాడైనా సినిమా చాలా బాగా తీశాడు. మంచి కాన్సెప్ట్ ఉన్న కథను నమ్మి తీసిన నిర్మాతకు ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా టీం అందరికీ గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

    చిత్ర నిర్మాత ఆకుల భాస్కర్ మాట్లాడుతూ..దర్శకుడు యల్. శ్రీనివాస్ తేజ్ చెప్పిన కథ నచ్చడంతో మా అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమా తియ్యడం జరిగింది. మంచి కంటెంట్ తో వస్తున్న సినిమా చాలా బాగా వచ్చింది. మార్చి లో విడుదల అవుతున్న ఈ సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా రిలీజ్ చేసిన టీజర్ కూడా మంచి అప్లాజ్ వచ్చింది. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న “బాలుగాడి లవ్ స్టోరీ” సినిమా గొప్ప హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

    చిత్ర దర్శకుడు యల్. శ్రీనివాస్ తేజ్ మాట్లాడుతూ..సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఎంతో బిజీగా ఉన్నా మేము అడిగిన వెంటనే వీడియో రూపంలో మా చిత్ర టీజర్ ను విడుదల చేశారు. వారికి మా ధన్యవాదాలు.మరియు ఈ రోజు మా టీజర్ లాంచ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చిన సముద్ర గారికి ధన్యవాదాలు. మంచి కథతో వస్తున్న ఈ చిత్రంలో లవ్, అండ్ క్రైమ్, సస్పెన్స్ తో ఈ సినిమా చాలా బాగుంటుంది. ఈ సినిమాలో నటించిన హీరో హీరోయిన్లు కొత్త వారైనా చాలా బాగా నటించారు.ఈ సినిమాలో ఐదు పాటలు ఉండగా ఇందులో ఉన్న ఒక్క ఐటమ్ సాంగ్ మినహా షూటింగ్ తో పాటు టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది.ఈ పాటను ఈ నెలలో పూర్తి చేసుకుని మార్చిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాము అన్నారు.

    చిత్ర హీరో ఆకుల అఖిల్ మాట్లాడుతూ..బాలుగాడి లవ్ స్టోరీ సినిమా చాలా బాగా వచ్చింది.ఇందులో రొమాన్స్, యాక్షన్, సస్పెన్స్ ఇలా చాలా ఉన్నాయి. షూటింగ్ స్టార్ట్ అయినప్పటినుండి ఇప్పటివరకు చాలా ఎంజాయ్ చేస్తూ సినిమా చేశాము.మంచి కథతో వస్తున్న ఈ సినిమా మంచి హిట్ అయితే మా పేరెంట్స్ కు ఈ సినిమాను గిఫ్ట్ గా ఇవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

    చిత్ర హీరోయిన్ దర్శక మీనన్ మాట్లాడుతూ.. ” బాలుగాడి లవ్ స్టోరీ” సినిమాలో హీరోయిన్ గా చేసి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

    నటీ నటులు
    ఆకుల అఖిల్, దర్శక మీనన్, చిత్రం శ్రీను, జబర్దస్త్ గడ్డం నవీన్, జబర్దస్త్ చిట్టిబాబు, రేవతి, లక్ష్మి, రాఘవరావు, మహేష్, సూరజ్ తదితరులు

    సాంకేతిక నిపుణులు
    సమర్పణ : శ్రీ ఆకుల భాస్కర్
    బ్యానర్ : భామ క్రియేషన్స్
    రైటర్, డైరెక్టర్ : యల్. శ్రీనివాస్ తేజ్
    నిర్మాత : ఆకుల మంజుల
    సహ నిర్మాతలు : జి. ప్రతిభ, అనిత,
    ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ : ఆకుల సాయి తేజ
    డి.ఓ.పి : రవి కుమార్ నీర్ల
    మ్యూజిక్ డైరెక్టర్ : ఘనశ్యామ్
    ఎడిటర్ : యాదగిరి కంజారాల
    కో డైరెక్టర్ : ఆళ్ళ శ్రీను
    అసోసియేట్ డైరెక్టర్ : అరకాల శశాంక్
    కోరి్యోగ్రాఫర్స్ : మోహన్ కృష్ణ, లక్ష్మిపురెడ్డి
    ఫైట్స్ : అశోక్ రాజ్
    పి. ఆర్. ఓ : హరీష్, దినేష్.

    Share post:

    More like this
    Related

    Actor Sonu Sood : తన అరెస్ట్ వారెంట్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన నటుడు సోనూసూద్

    Actor Sonu Sood : నటుడు సోనూ సూద్‌పై అరెస్ట్ వారెంట్ జారీ...

    Nagarjuna : బీజేపీ లోకి నాగార్జున..? కుటుంబంతో కలిసి మోడీ దగ్గరకు..

    Nagarjuna : టాలీవుడ్‌ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఇటీవల తన కుటుంబంతో...

    interest rates : లోన్లు తీసుకున్న వారికి గుడ్‌న్యూస్.. వడ్డీరేట్లు తగ్గించిన ఆర్బీఐ

    interest rates : ఆర్బీఐ శుభవార్త తెలిపింది. కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తూ...

    EV Buses : హైదరాబాద్-విజయవాడ మధ్య ఈవీ బస్సులు: టికెట్ ధర రూ. 99 మాత్రమే!

    EV buses: హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణించే వారికో శుభవార్త! ఈ రెండు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Suicide : భార్యపై అనుమానం.. బిడ్డను బ‌లి తీసుకున్న ఉన్మాదం

    Suicide : దంపతుల మధ్య అనుమానమనే చిచ్చు రేగి ఎన్నో కుటుంబాలు...