సూపర్ స్టార్ మహేష్ బాబు పై తీవ్ర స్థాయిలో విమర్శల జడివాన ఎక్కువైంది. ఘనమైన చరిత్ర కలిగిన సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు సాధారణ మనిషి వలె మహాప్రస్థానంలో చేయడం ఏంటి ? అని అటు అభిమానులు ఇటు సినిమా రంగంలోని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు కూడా. మహేష్ బాబు తండ్రి విషయంలో చాలా తప్పు చేసాడని ఘాటుగా విమర్శిస్తున్నారు.
చరిత్ర సృష్టించిన వాళ్ళ అంత్యక్రియలు తప్పకుండా అదేస్థాయిలో చేస్తారు. ఫామ్ హౌజ్ లో చేయడం పరిపాటి …… కృష్ణ అంత్యక్రియలను ఫామ్ హౌజ్ లో కాకుండా , పద్మాలయా స్టూడియోస్ లో కాకుండా మహాప్రస్థానంలో చేయడం ఏంటని విమర్శల జడివాన కురిపిస్తున్నారు. అయితే ఇదే సమయంలో మహేష్ బాబు ఇలా ఆలోచించి ఉండకపోవచ్చని , లేదంటే మహేష్ మదిలో మరో ఆలోచన ఏదైనా ఉందేమోనని అందుకే అంత్యక్రియలు అలా చేసి ఉంటాడని వెనకేసుకొచ్చే వాళ్ళు కూడా ఉన్నారు.
ఈ విమర్శల వల్ల కావచ్చు కృష్ణ స్మారకం భారీ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట కృష్ణ కుటుంబ సభ్యులు. కృష్ణ నటించిన పలు చిత్రాల షీల్డ్ లతో పాటుగా ఆయన సాధించిన అవార్డులను కూడా స్మారకంలో పెట్టేలా ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. Did mahesh babu make a mistake regarding krishna funeral