This Content Is Only For Subscribers
సూపర్ స్టార్ మహేశ్ బాబు అంటే ఇష్టపడని యూత్ ఉండరంటే అతిశయోక్తి కాదు. హాలీవుడ్ స్టార్ లుక్స్ కు మ్యాచ్ అయినట్లుగా ఉంటారు మహేశ్ బాబు. ఆయనను యూత్ కూడా తెగ ఫాలో అవుతూ ఉంటుంది. ఇక సినిమా కెరీర్ కు వస్తే చిన్న తనంలోనే కెమెరా ముందకు వచ్చిన మహేశ్ వైవిధ్య భరితమైన సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోగా నిలదొక్కుకున్నారు. దర్శకధీరుడు రాజమౌళీనే మహేశ్ బాబుతో సినిమా తీయాలని అనుకుంటున్నారు అంటే ఆయన క్రేజ్ ఎంటో అర్థమవుతుంది.
మహేశ్ బాబు ప్రస్తుతం ‘గుంటూరు కారం’ సినిమాలో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి షెడ్యూల్ కు సంబంధించి ఇటీవల వీడియో గ్లిప్స్ ను విడుదల చేశారు మేకర్స్. భారీ వ్యూవ్స్ ను సొంతం చేసుకున్న ఈ గ్లిప్స్ మరో సారి మహేశ్ బాబులో ఉన్న మాస్ హీరోను తట్టిలేపింది. అయితే తదుపరి షెడ్యూల్ షూటింగ్ ఎప్పుడు అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఈ మధ్య మహేశ్ బాబు కుటుంబ సభ్యులతో ఫంక్షన్ లను ఎంజాయ్ చేస్తున్నారు. ప్రముఖ జీవీకే రెడ్డి మనుమరాలు శ్రీయా భూపాల్ బేబీ షవర్ పార్టీకి కుటుంబంతో వచ్చిన ఆయన సందడి చేస్తూ ఫొటోలు తీసుకున్నారు. వీటని సోషల్ మీడియాలో తన ఖాతా ద్వారా అప్ లోడ్ చేశారు.
ఇక రాజమౌళితో తన తదుపరి చిత్రం #SSMB 29 ప్లాన్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన కథను రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇక దీన్ని పట్టాలెక్కించాలని చూస్తున్నారు మేకర్స్. అయితే, అన్ని సినిమాల్లా కాకుండా ఈ సినిమాను వేగంగా పూర్తి చేస్తానని రాజమౌళి క్లారిటీ కూడా ఇచ్చారు.
జీన్స్ డ్రెస్ లో కూలింగ్ క్లాస్ తో చెదిరిన క్రాప్ లో మ్యాన్లీ లుక్స్ తో అదరగొడుతున్నాడు మహేశ్ బాబు. ఈ లుక్స్ చూస్తుంటే హాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నాడు. తన తదుపరి చిత్రం రాజమౌళికి సంబంధించిన మూవీ కోసం ఫొటో షూట్ లో భాగంగా ఈ చిత్రాలను తీసినట్లు తెలుస్తోంది. ఈ పిక్ లలో అచ్చం హాలీవుడ్ యాక్షన్ అడ్వెంచర్ హీరోగా కనిపిస్తున్నారు మహేశ్ బాబు. ఈ పిక్స్ చూసిన నెటిజెన్లు ‘ఆ మూవీ (#SSMB29) కోసం చేసిన టెస్ట్ లుక్స్ అనుకుంటా..?’ అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్ లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్న ‘గుంటూరు కారం’ రెండో షెడ్యూల్ ప్రకటించకున్నా.. వచ్చే సంక్రాంతి బరిలో దీన్ని ఉంచాలని చూస్తున్నారట మేకర్స్. 13 జనవరి, 2024 అంటూ డేట్ కూడా అనౌన్స్ చేశారు. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.