
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహా రెడ్డి 2023 జనవరి 12 న భారీ ఎత్తున విడుదల అవుతున్న విషయం తెలిసిందే. దాంతో జనవరి 6 న వీరసింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు లో చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఒంగోలు డైరెక్టర్ గోపీచంద్ మలినేని జిల్లా కావడంతో వీరసింహా రెడ్డి ఈవెంట్ ను అక్కడ చేస్తున్నారు. ఇందుకోసం ఒంగోలులో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు కానున్నట్లు సమాచారం.
బాలయ్య సినిమా ఫంక్షన్ కు పవన్ కళ్యాణ్ వస్తే …… మరింత సంచలనం అవ్వడం ఖాయం. ఎందుకంటే జనవరి 12 న బాలయ్య సినిమా వీరసింహా రెడ్డి విడుదల అవుతుండగా ఆ మరుసటి రోజే అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం విడుదల అవుతోంది. దాంతో నందమూరి- మెగా అభిమానుల మధ్య నువ్వా – నేనా అన్నట్లుగా పోటీ నెలకొనడం ఖాయం. ఇలాంటి సమయంలో బాలయ్య సినిమా కోసం పవన్ వస్తే ….. చిరంజీవి అభిమానులు పవన్ మీద కాస్త ఆగ్రహం వ్యక్తం చేయడం ఖాయమని భావిస్తున్నారు.
బాలయ్య ఆహా కోసం చేస్తున్న అన్ స్టాపబుల్ 2 షోలో పవన్ కళ్యాణ్ పాల్గొనడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలే బాలయ్య షూటింగ్ లొకేషన్ కు పవన్ కళ్యాణ్ వెళ్లి కలిసిన సంగతి కూడా తెలిసిందే. రేపు అంటే డిసెంబర్ 27 న బాలయ్య , పవన్ ల షో షూటింగ్ స్టార్ట్ కానుంది. ఏపీలో 2024 లో శాసనసభకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బాలయ్య – పవన్ ల కలయిక రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.