పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 100 కోట్ల రెమ్యునరేషన్ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయ్యింది. తాజాగా సుజీత్ దర్శకత్వంలో OG అనే చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఇటీవలే ప్రారంభం కాగా రెగ్యులర్ షూటింగ్ కు రంగం సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కనిపించేది తక్కువ సేపు అయినప్పటికీ 100 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది.
దాంతో పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయ్యింది. పవన్ కళ్యాణ్ సినిమా అంటే పాన్ ఇండియా సినిమా కాదు కాని ఈ చిత్రాన్ని మాత్రం పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయాలని గట్టిగానే ప్లాన్ చేస్తున్నారట. అందుకే 100 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేశాడట పవన్. ఇంకేముంది పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే చాలు అని సంతోష పడుతున్న నిర్మాత 100 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడానికి అంగీకరించాడట.
పవన్ కళ్యాణ్ చాలా సినిమాలు ఒప్పుకుంటున్నాడు. హరిహర వీరమల్లు చిత్రం ఇంకా పూర్తి కాలేదు అయినప్పటికీ వరుసపెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలు ఉండటంతో పవన్ కళ్యాణ్ ఇలా వరుసగా సినిమాలు చేస్తున్నాడు.